ప్రతి సినిమాను మనం లవ్‌స్టోరీగా చెప్పుకున్నా కూడా ఇప్పటి వారికి 'మరో చరిత్ర, సాగరసంగమం, అభినందన, గీతాంజలి, తొలిప్రేమ' వంటి క్లాసిక్ లవ్‌స్టోరీలు మాత్రమే కలకాలం గుర్తుంటాయి. అందునా యాక్షన్ సినిమాలతో పోలిస్తే ప్రేమకథలను ఇంకా ఎంతో జాగ్రత్తగా తీయాలి. ఏమాత్రం బోర్ కొట్టించినా కూడా లవ్ ఫీల్ మిస్సయ్యే ప్రమాదం ఉంది. దానికి రామ్‌చరణ్ నటించిన 'ఆరెంజ్' చిత్రం ఓ పెద్ద ఉదాహరణ. కాగా ప్రస్తుతం మరో యువ మెగాహీరో తన బాబాయ్ టైటిల్ 'తొలిప్రేమ' టైటిల్‌తో వస్తున్నాడు. ఇందులో హీరో ఆదిత్య వర్ష అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. వారిద్దరు ఒకటికి రెండు సార్లు కలిసి విడిపోతారు. ఇలా విడిపోవడానికి బలమైన కారణాన్ని దర్శకుడు ఎంత బాగా చూపిస్తాడు? అనే దానిపై ఈ చిత్ర జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.
ఇక కాలేజీలో యాంగ్రీనెస్, లండన్ ఎపిసోడ్స్‌లో మెచ్యూర్డ్‌నెస్, కాస్త కామెడీ.. ఇలా ఈ చిత్రం ట్రైలర్‌లో అన్నింటిని మిక్స్ చేశాడు దర్శకుడు. ఇక జార్జ్ విలియమ్స్ ఫొటొగ్రఫీ, థమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అర్ధమవుతోంది. వరుణ్‌తేజ్ విషయానికి వస్తే తన తొలి చిత్రం 'ముకుందా, కంచె, ఫిదా' ఇలా ప్రతి చిత్రం ఎంతో వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాడు. మరి వరుణ్‌తేజ్‌కి వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు కరుణాకరన్ లాగా పెద్ద క్లాసిక్ లవ్‌స్టోరీని అందిస్తాడా? లేదా? అనేది చూడాలంటే ఈనెల 10వ తేదీ వరకు వెయిట్ చేయాలి.
ఇక 9వ తేదీన సాయిధరమ్‌తేజ్ 'ఇంటెలిజెంట్'. 10వ తేదీన 'తొలిప్రేమ' రానున్న నేపధ్యంలో మెగా కోడలు ఉపాసన వరుణ్‌తేజ్ 'తొలిప్రేమ'కి విషెష్ చెప్పగా, రామ్‌చరణ్ సాయి నటిస్తున్న 'ఇంటెలిజెంట్'కి బెస్టాఫ్‌లక్ చెప్పాడు. మరి ఈ రెండింటిలో ప్రేక్షకులను మరిపించి, మురిపించే చిత్రం ఏది అవుతుంది? అనేది వేచిచూడాల్సివుంది....!