నాని నిర్మాతగా తెరకెక్కిన మొదటి చిత్రం 'అ!' ఈ చిత్రంలో పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. కాస్టింగ్ అయితే భారీగానే వుంది కానీ సినిమా బడ్జెట్ మాత్రం మీడియం రేంజే అంట. ఈ చిత్రం చాలా మంది నటించిన ఇద్దరు హీరోయిన్స్ కి మాత్రం ఈ సినిమా కీలకం కానుంది.
నిత్య మీనన్, కాజల్ ఆల్రెడీ వారి సినిమాలతో ఫామ్ లో వున్నారు కాబట్టి వీరికి ఈ సినిమా పోయిన పర్లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకి కూడా ఒరిగేదేమీ ఉండదు మర్యాద రామన్నలో సైకిల్ కి డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్న మాదిరిగా.. తన వాయిస్ తో కాసింత మ్యాజిక్ చేస్తాడు. అలానే నాని కూడా ఈ చిత్రంలో చేపకి జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాడంతే. ఒకవేళ సినిమా అటు ఇటు ఐన నిర్మాతగా ఓ అనుభవం వస్తుందంతే.
కానీ ఈ చిత్రంలో నటించిన రెజినా, ఈషా రెబ్బాకి అలా కాదు. రెజినా తెలుగులో ఎన్ని సినిమాలు చేసిన సరైన సక్సెస్ రావట్లేదు. ఆమె లేటెస్ట్ గా నటించిన చిత్రం 'నక్షత్రం' సినిమాలో గ్లామర్ దారబోసిన ఆమెపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇక అలానే తెలుగు బ్యూటీ బేబీ ఈషా రెబ్బా కూడా 'అ!' పై ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకూ అరడజన్ తెలుగు సినిమాలు చేసిందనే పేరే కానీ.. సక్సెస్ రుచి మాత్రం ఇంకా ఈ భామకు తెలియలేదు. మరి ఈ చిత్రంతో ఐన వీరిద్దరూ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.