బిగ్ బాస్ షో బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి టాలీవుడ్ కి పాకింది. కోలీవుడ్ లో కూడా వచ్చినప్పటికి అక్కడ సక్సెస్ కాలేదు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ హోస్టింగ్ చేయటం వలన మరింత సక్సెస్ అయింది ఈ షో. అయితే బిగ్ బాస్ ఈసారి నిర్వాహకులు హంగామాను కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్ లో స్టార్ట్ అయ్యే ఈ షోకి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మొదటి సీజన్ పది వారాల పాటు సాగింది. ఐతే ఈసారి 14 వారాలు పాటు ఈ షో కొనసాగనుంది. మళ్లీ ఈ సీజన్ కి కూడా ఎన్టీఆరే హోస్టింగ్ చేయనున్నాడు. మొదటి సీజన్ షూటింగ్ టైంలో అటు 'జై లవ కుశ' షూటింగ్, ఇటు బిగ్ బాస్ షూటింగ్ ఒకేసారి కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలానే త్రివిక్రమ్ సినిమాలో చేస్తూ ఇటు బిగ్ బాస్ సీజన్ 2 ను ఎన్టీఆర్ ఫినిష్ చేయనున్నాడు.
మొదటి సీజన్ కంటే ఈసారి ఎక్కువ మంది తారలు ఉన్నట్టు తెలుస్తుంది. డిమాండ్ పెరగడంతో కొన్ని రికమండేషన్స్ కూడా నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఎవరిని నిర్ణయిస్తారో అనేది షో స్టార్ట్ అయ్యే వరకు చెప్పలేం. ఈసారి హైదరాబాద్ లోనే సీజన్ 2 సెట్ వేయనున్నారు.