తెలుగు ఇండస్ట్రీలో ఆయన తనకు తానుగా నేను క్రమశిక్షణ కలిగిన వాడిని, నా కుమారులు అంత కన్నా ఎక్కువ క్రమశిక్షణ కలిగిన వారు అని చెప్పుకుంటారు. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతాను అంటారు. ఆయనే కలెక్షన్ కింగ్‌గా, డైలాగ్ కింగ్‌గా పేరున్న మోహన్‌బాబు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'గాయత్రి' విడుదలైంది. మరోవైపు సాయిధరమ్‌తేజ్-వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటెలిజెంట్' చిత్రం మరీ అవుట్ డేటెడ్‌గా ఉండటంతో దాని కంటే 'గాయత్రి' బాగుంది అనే టాక్ వస్తోంది. ఇక మోహన్‌బాబు ఈ చిత్రం వేడుకలో కూడా హీరోయిన్ శ్రియను ఎంతగానో పొగిడాడు. సామాన్యంగా పొగిడే అలవాటు లేని మోహన్‌బాబు శ్రియను అలా పొగడటం చాలా మందికి ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. అయినా ఇది అభినందనే గానీ పొగడ్త కాదని మోహన్‌బాబు అన్నారు.
తాజాగా కూడా ఆయన మరోసారి శ్రియపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇండస్ట్రీకి నేనెందరో హీరోయిన్లను పరిచయం చేశాను. వారందరూ ఇప్పుడు తెగ ఫోజులు కొడుతున్నారు. శ్రియను నేను పరిచయం చేయలేదు. అయినా ఆమె గొప్పనటి అని చెబుతాను. 'గాయత్రి'లో ఆమె చేసిన పాత్ర మరొకరు చేయలేరు. ఈ విషయాన్ని నేనే కాదు.. సినిమా చూసిన వారందరు చెబుతారు అని చెప్పుకొచ్చాడు. ఇక మరో ఇంటర్వ్యూకి సంబంధించిన మోహన్‌బాబు మాట్లాడిన ప్రోమో సంచలనాలనంగా మారింది. ఇందులోని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మోహన్‌బాబుని ఉద్దేశించి, మోహన్‌బాబు సెటిల్‌మెంట్స్ చేసి పైకొచ్చాడు అని ప్రశ్నించగా, నీకు కూడా ఫ్యామిలీ ఉందని మర్చిపోవద్దు అని మోహన్‌బాబు హెచ్చరిస్తున్నాడు.
ఇక రజనీకాంత్‌ని వేదికలపైనే ఒరేయ్.. రేయ్ అని పిలవడం గురించి మాట్లాడితే వాడికి నాకు లేని ఇబ్బంది మధ్యలో మీకెందుకు? అని ప్రశ్నించాడు. ఇక సూర్యకిరణ్ అనే దర్శకుడిని కొట్టిన మాట వాస్తవమే. వాడు షూటింగ్‌లో పేకాట ఆడుతుంటే కొట్టాను అని చెప్పుకొచ్చాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూ పలు సంచలనాలకు వేదికగా మారనుందని ప్రోమోలు చూస్తేనే అర్ధమవుతోంది.