గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన సమంతానే కనబడుతుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కి జోడిగా రామలక్ష్మి గా రంగస్థలంలో నటిస్తున్న సమంత... ఆ సినిమాలో ఎలా ఉంటుందో అనేది రంగస్థలం టీజర్ లో చూపించారు. సమంత రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో 1985 లో ఉండే స్వచ్ఛమైన పల్లెటూరి అమ్మాయి గెటప్ లో అరిపించేసింది. రంగస్థలం టీజర్లో నవ్వులు చిందిస్తూ ఊరమాస్ లెక్క అదరగొట్టేసి చిట్టి బాబు (రామ్ చరణ్) గుండెల్ని పిండేసింది. వయ్యారాలు పోతూ.... గంభీరంగా ఉంటూ.. నవ్వుతూ నవ్విస్తూ యువతని చక్కిలిగిలి పెట్టిన సమంత ప్రస్తుతం తన జోరు చూపిస్తుంది. ఏ పాత్రకైనా అలవోకగా సెట్ అవుతానని రుజువు చేస్తుంది.
అలాగే టాలీవుడ్ లో రంగస్థలం మార్చ్ 30 న విడుదలకు సిద్ధమవుతుంటే.... కోలీవుడ్ లో సమంత - విశాల్ కలిసి నటించిన అభిమన్యుడు కూడా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాల్ కి జోడిగా సమంత నటిస్తున్న ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావాల్సి ఉండగా... అనూహ్యంగా మార్చ్ నెలాఖరుకు పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన అభిమన్యుడు టీమ్.. వాలెంటైన్స్ డే సందర్భంగా యాంగ్రీబర్డ్ పాట మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. మరి ఆ పాటలో విశాల్ అల్లరితో పాటు సమంత నవ్వులే హైలెట్.
సమంత ఆ వీడియో లో చక్కటి చీర కట్టుతో ఫేస్ ఎక్సప్రెషన్స్ తో..నవ్వులతో అదరగొట్టేసింది. సమంత చిలిపి నవ్వు తో అభిమన్యుడు యూనిట్ మొత్తం హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ ని ఆ వీడియోలో చూపించారు. మరి సమంత కి పోటీగా సమంతానే అన్నట్టుగా రంగస్థలం టీజర్.... అభిమన్యుడు సాంగ్ టీజర్ ఉన్నాయంటే నమ్మండి. ఇకపోతే తెలుగులో రంగస్థలం, మహానటితోను, కోలీవుడ్ లో అభిమన్యుడు, విజయ్ సేతుపతి సరసన మరో మూవీ షూటింగ్ తో సమంత క్షణం విశ్రాంతి లేకుండా గడిపేస్తుంది.