Advertisementt

వర్మ, కోనలు ఎంత సక్కగుందో అనేశారు!

Fri 16th Feb 2018 09:27 PM
ram gopal varma,kona venkat,rangasthalam,yentha sakkagunnave,song  వర్మ, కోనలు ఎంత సక్కగుందో అనేశారు!
RGV and Kona Venkat Praises Rangasthalam Song వర్మ, కోనలు ఎంత సక్కగుందో అనేశారు!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఎవరిని వర్మ పొగిడినా ఎల్లకాలం వారినే పొగుడుతాడని లేదు. బావుంటే ఎంత బాగుందని మెచ్చుకుంటాడో తేడా అనిపిస్తే తానే తేడాగా మారిపోతాడు. అలాగని ఆయన అన్ని పబ్లిసిటీ కోసమే కాదు.. కొన్ని మంచి విషయాలను కూడా పొగుడుతాడు. వర్మ దేనిలో వ్యంగ్యం చూపించదలుచుకున్నాడు? ఎందులో ఆయన నిజమైన నిజాయితీతో ట్వీట్‌ చేశాడు? అనేది తెలుసుకోవడం కాస్త కష్టమైన పనే. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం 'రంగస్థలం 1985' చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో పాటు ఆ కాలాన్ని ప్రతిబింబించేలా ఉన్న ప్రాపర్టీస్‌ పిక్స్‌ అన్ని ప్రేక్షకులలో ఉత్సుకతను రేపుతున్నాయి. 

ఇక తాజాగా వాలంటైన్స్‌డే సందర్భంగా విడుదల చేసిన పాట శ్రోతలని, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లచ్చిమి పాట వింటే ఎంతో కాలానికి పల్లెల నేపధ్యాన్ని కళ్లకు కట్టేలా, చంద్రబోస్‌ అందించిన సాహిత్యం, దేవిశ్రీప్రసాద్‌ జానపద బాణీ తరహాలో ఈ పాటకి ఇచ్చిన ట్యూన్‌లకి విశేష స్పందన వస్తోంది. ఇక గాత్రం కూడా ఈ పాటని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. గ్రామీణ యువకుడైన హీరో సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబు, ఆ గ్రామంలో ఉండే గ్రామీణ యువతి రామలక్ష్మిని ఊహించుకుంటూ ఉండే ఈ పాటను విన్న వర్మ వెంటనే స్పందించాడు. 'రంగస్థలం' టీజర్స్‌ బాగా నచ్చాయి. తాజాగా విడుదలైన ఈ పాట ఈ చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకుని వెళ్లింది. అంత చక్కని సాహిత్యం , అద్భుతమైన ట్యూన్‌ అందించిన చంద్రబోస్‌, దేవిశ్రీప్రసాద్‌లకు మిలియన్‌ చీర్స్‌ అంటూ వర్మ స్పందించాడు. ఇక మాటల రచయితగా, పాటల రచయితగా వర్మకి శిష్యుడైన రచయిత కోనవెంకట్‌ స్పందిస్తూ, చాలా అరుదుగా వచ్చే కొన్ని పాటలు మన గుండెలను తాకి, మన మనసులను మీటి, మన జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. 

ఇది అచ్చం అలాంటి పాటే. ఈ పాటకు గాను సమంత ఎప్పటికీ గుర్తుండి పోతుంది. రామ్‌చరణ్‌ చూపించిన హావభావాలు అద్వితీయమని కోనవెంకట్‌ ప్రశంసల వర్సం కురిపించాడు. అయితే ఇప్పుడే ఏముంది.. ముందు వచ్చే సాంగ్‌ ఇంకా ఇరగదీసేలా ఉంటాయని, ముఖ్యంగా పూజాహెగ్డేపై తీసిన ఐటం సాంగ్‌ 'అ.. అంటే అమలాపురం' వంటి పాటను కూడా బీట్‌ చేస్తుందని యూనిట్‌ నమ్మకంతో ఉంది.

RGV and Kona Venkat Praises Rangasthalam Song:

RGV sensational Comments on Rangasthalam Yentha sakkagunnave song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ