ఈ రోజున నా మొదటి చిత్రం 'శివ' మొదటి రోజు షూటింగ్ జరిగిన తొలిరోజు ఇది అని వర్మ నాగార్జునతో తాను చేసిన 'శివ' చిత్రం గురించి చెప్పుకొచ్చాడు. ఇక నా తొలి చిత్రం హీరో నాగార్జునతో చేస్తున్న తాజా చిత్రం స్టిల్స్ అంటూ నాగ్ స్టిల్స్‌ని పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన నాగార్జున, 1989 ఖచ్చితంగా 29 ఏళ్ల కిందట ఈ రోజునే 'శివ' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, కొత్త ఆలోచనా విధానానికి నాంది పలికింది. నాగ్-వర్మ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంతో మరోసారి రాక్ చేసే సమయం ఆసన్నమైంది. అంటూ నాగ్ కూడా కొత్త చిత్రంలోని కొన్ని స్టిల్స్‌ని రిలీజ్ చేశాడు.
మరోవైపు ఇంత వరకు వర్మ ఏమి చేసినా చట్టానికి వ్యతిరేకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ తాజాగా సామాజిక కార్యకర్త దేవితో వర్మ 'జీఎస్టీ' సమయంలో అనుచితంగా మాట్లాడాడని, దేవిని మహిళలందరి తరపున ఈమే వకాల్తా పుచ్చుకుందని, సమాజంలోని అన్ని వర్గాలకు తానే ప్రతినిధిగా వ్యవహరిస్తోందని, తన జీఎస్టీని వ్యతిరేకించే అందరినీ కొడతానని చెప్పడంతో దేవి పోలీసులను ఆశ్రయించడంతో వర్మ అరెస్ట్ ఖాయమంటున్నారు.