Advertisementt

ఈ నటుడు బాహుబలిలో ఎందుకు చేయలేదంటే?

Sun 18th Feb 2018 05:56 PM
aditya menon,chance,bahubali,eega,mirchi,interview  ఈ నటుడు బాహుబలిలో ఎందుకు చేయలేదంటే?
Actor Adithya Menon Latest Interview ఈ నటుడు బాహుబలిలో ఎందుకు చేయలేదంటే?
Advertisement
Ads by CJ

ఇటీవల సుమన్‌ మాట్లాడుతూ, సర్కిల్స్‌, రిలేషన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేసినప్పుడే ఎక్కువ అవకాశాలు వస్తాయని తాను కూడా మొదట్లో భావించానని, కానీ కాలం కలిసి రాకపోతే ఎవ్వరూ టచ్‌లోకి రారు అన్న విషయం ఆలస్యంగా తనకి తెలిసిందని, బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంటే ఏదీ పనికిరాదనే వాస్తవం తెలుసుకున్నానని చెప్పాడు. ఇక తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నటిస్తున్న ఆదిత్యమీనన్‌కి ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. కోటేరు ముక్కుతో ఆయన బాడీ విలన్‌ పాత్రలకు బాగా సూటవుతుందని కాబోలు దర్శకులందరూ ఆయనకి విలన్‌ పాత్రలనే ఎక్కువగా ఇస్తూ వస్తున్నారు. 'ఈగ, దూకుడు, మిర్చి' వంటి చిత్రాలలో ఆయన నటనకు మంచి మార్కులు పడటమే కాదు.. ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. 

ఇక రాజమౌళి 'ఈగ'లో అద్భుతంగా నటించినా కూడా రాజమౌళి ఆయనకు 'బాహుబలి'లో అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ. 'బాహుబలి'లో పాత్ర రాకపోవడం నాకు కూడా చాలా బాధ కలిగించింది. అయినా అన్ని చిత్రాలలో మనమే నటించాలని భావించడం కూడా తప్పు అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఇక విలన్ల మధ్య కూడా మంచి పోటీ ఏర్పడింది. నా దృష్టిలో సినిమాలలో అవకాశం రావాలంటే 10శాతం టాలెంట్‌ సరిపోతుంది. మిగిలిన 90శాతం సర్కిల్స్‌, నెట్‌వర్కింగ్‌, రిలేషన్స్‌ మీద ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు. 

ఈ విషయంలో నేను చాలా పూర్‌ అన్నాడు. మొత్తానికి ఈయన సుమన్‌కి పూర్తి విరుద్దమైన భావాలను వ్యక్తం చేశాడు. అయినా ఈయన చెప్పిన దాంట్లో కూడా కాస్త వాస్తవం కూడా ఉంది అనే చెప్పాలి. సుమన్‌, ఆదిత్యామీనన్‌ ఇద్దరి విషయాలు సమయం బాగున్నప్పుడే వర్కౌట్‌ అయి, మన అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే నిజరూపం దాలుస్తాయి. 

Actor Adithya Menon Latest Interview:

Adithya Menon About Why He Didn't Get A Chance To Act In Bahubali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ