Advertisementt

యంగ్ టైగర్ మరోసారి తండ్రి కాబోతున్నాడా!

Sun 18th Feb 2018 09:46 PM
ntr,lakshmi pranathi,pregnant,second time,may  యంగ్ టైగర్ మరోసారి తండ్రి కాబోతున్నాడా!
Good News For Tarak Again యంగ్ టైగర్ మరోసారి తండ్రి కాబోతున్నాడా!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగానూ, బుల్లితెర వ్యాఖ్యాతగాను దూసుకుపోతున్నాడు. ఇక ఎన్టీఆర్ తన ప్రొఫెషన్ కి ఎంత విలువిస్తాడో.. అలాగే తన కుటుంబానికి అంతే విలువనిస్తాడు. తల్లి చాటు బిడ్డగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నార్ని వారమ్మాయి లక్ష్మి ప్రణతిని 2011లో అర్దాంగిని చేసుకుని కుటుంబంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ కి లక్ష్మి ప్రణతి, అభయ్ రామ్ అనే ఒక బుల్లి ఎన్టీఆర్ ని కానుకగా ఇచ్చింది. మరి సినిమా షూటింగ్స్ లో ఎప్పుడూ బిజీగా వుండే ఎన్టీఆర్ తన కొడుకుతో టైం ఎలాస్పెండ్ చేస్తాడో అనే విషయాన్నీ చాలా సందర్భాల్లో చెప్పాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరోమారు తండ్రి కాబోతున్నాడు. ఇది నిజమే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి మరోసారి  ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ మే లోనే ఎన్టీఆర్ దంపతులకు మరొక సంతానం కలగబోతుంది కూడా. అందుకే ఎన్టీఆర్ వీలైనంత సమయం ఫ్యామిలీకి కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

Good News For Tarak Again:

Tarak To Become Dad For Second Time  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ