Advertisementt

సమంతకి చైతు రికమండేషన్‌!

Mon 19th Feb 2018 02:21 PM
naga chaitanya,samantha,recomandation,shiva nirvana  సమంతకి చైతు రికమండేషన్‌!
Naga chaitanya recomandation for samantha సమంతకి చైతు రికమండేషన్‌!
Advertisement
Ads by CJ

పెళ్లయిన తర్వాత కూడా అక్కినేని కోడలు సమంత ఎక్కడా తగ్గడం లేదు. కాస్త గ్లామరస్‌ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎవరైనా విమర్శిస్తే నా కుటుంబం, భర్తకి లేని అభ్యంతరం మీకెందుకు? అని మండిపడుతోంది. ఇక భార్యాభర్తల మధ్య అండర్‌ స్టాడింగ్‌ బాగా ఉంటే వివాహం తర్వాత కూడా చేసే వృత్తులకు ఆటంకం లేదని అంటోంది. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్‌చరణ్‌ సరసన 'రంగస్థలం 1985', 'మహానటి'తో పాటు తమిళంలో విశాల్‌ నటించిన 'అభిమన్యుడు' చిత్రాలు సైతం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక తానే నిర్మాతగా లీడ్‌రోల్‌ చేస్తూ కన్నడలో సూపర్‌హిట్‌ అయిన 'యూటర్న్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయనుంది. 

మరోవైపు శివకార్తికేయన్‌తో ఓ చిత్రం ఒప్పుకుంది. ఇదే సమయంలో అశ్వనీదత్‌ నిర్మాతగా నాగార్జున-నానిల కాంబినేషన్‌లో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందే మల్టీస్టారర్‌లో ఆమె నాని సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. అంటే అదే జరిగితే 'రాజు గారి గది 2' తర్వాత తన మామ నాగార్జున నటించే చిత్రంలో కోడలు నటించే రెండో చిత్రం ఇది అవుతుంది. ఇక ఈమె తన భర్త నాగచైతన్య హీరోగా 'నిన్నుకోరి' చిత్రం దర్శకుడు శివనిర్వాణ డైరెక్షన్‌లో చేయబోయే చిత్రంలో ఓ కీలక పాత్రను చేయనుందట. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు కలిసి నటించే తొలి చిత్రం కావడంతో అందరు ఈ చిత్రం పట్ల ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి', 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రాలు పూర్తి అయిన తర్వాత చైతూ ఈ చిత్రం ప్రారంభించనున్నాడు. 

మొదట శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించేందుకు సమంత నో చెప్పిందట. కానీ కథ మొత్తం విన్న తర్వాత నాగచైతన్య చిత్రంలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కి సమంత అయితేనే బాగుంటుందని భావించి సమంతకి రికమెండ్‌ చేయడంతో సమంత ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర కీలకమైనదే అయినా అది ఫుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌కి తక్కువ, గెస్ట్‌ రోల్‌కి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Naga chaitanya recomandation for samantha:

Naga Chaitanya and Samantha Akkineni to act together in a film soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ