బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి పాకిన బిగ్ బాస్ షో తెలుగులో బాగా క్లిక్ అయింది. సీజన్ -1కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తి కట్టించాడు. సీజన్ - 1కు మంచి రెస్పాన్స్ రావడంతో.. నిర్వాహకులు సీజన్ - 2ను స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు.
పోయిన సారిలా కాకుండా ఈ సారి షోను మరింత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాలని.. బాగా ఫేమస్ ఆర్టిస్ట్స్ ను పెడదాం అని అనుకుంటున్నారు. అయితే సీజన్ - 2 కూడా వ్యాఖ్యాతగా హీరో జూనియర్ ఎన్టీఆర్ నే అనుకున్నారు అంత. కానీ ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించట్లేదు.
అవును.. త్రివిక్రమ్.. రాజమౌళి సినిమాలు వెంట వెంటనే ఉండటం వల్లన డేట్స్ ఇబ్బంది కారణంగా ఎన్టీఆర్ ఈ సీజన్ నుండి తప్పుకుంటున్నట్టు, తనకు కుదరదని చెప్పేశారు. మరి, వ్యాఖ్యాతగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానిని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సో దీనికి నానిఏ కరెక్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనికి నాని ఒకే అంటాడో లేదో చూడాలి.