కొంతమంది హీరోయిన్స్ అందంగా లేకపోయినా టాలెంట్ తో పైకొచ్చేస్తారు. అలాగని అందరికి టాలెంట్ లేదు అని కాదు. టాలెంట్ ఉన్న సుడి ఉండాలి. లక్కు లేకపోతే అందం ఉన్నా... నటనలో టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్ లో ఒక హీరోయిన్ టాలీవుడ్ సర్కిల్ లో నిలబడి ఉంది. ఆమె ఎవరో కాదు 'మనసుకు నచ్చింది' అన్న అమైరా దస్తూర్. అసలు ఈ హాట్ బేబీ పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన 'రోగ్' సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ సినిమా షూటింగ్ లో నాలుగు రోజులు పాల్గొని మరీ ఆ సినిమా నుండి బయటికొచ్చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి నటించింది.
కానీ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. సరే మంజుల డైరెక్షన్ లో గొప్పగా సందీప్ కిషన్ కి జోడిగా 'మనసుకు నచ్చింది' అంటూ వచ్చింది. కానీ ప్రేక్షకులు మాత్రం నువ్వు మాకు నచ్ఛలేదు అన్నారు. ఎంతగా హాట్ గా అందాలు ఆరబోసినా, నటనలో మెళకువలు నేర్చుకున్నా లక్కు లేకపోతే పరిస్థితి అమైరా దస్తూర్ పరిస్థితి లాగే ఉంటుంది. ఎందుకంటే అందానికి అందం, గ్లామర్ షో చెయ్యమన్నా వెనక్కి తగ్గని ఆమెకి అస్సలు పేరు తెచ్చే పాత్రలు రాకపోవడం అలా ఉంచి అసలు అవకాశాలు వస్తాయా అంటేనే డౌట్ పడే పరిస్థితి ఉంది.
మరి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో ఎక్కడా తనకి స్టార్ ఇమేజ్ రాలేదు సరికదా అసలు అవకాశాలే లేకుండా పోయాయి. పాపం అమైరా అంటున్నారు అంతా. మరి అందరూ అమైరాని చూసి అందం అయితే ఉంది కానీ... అదొక్కటే (లక్కు) లేదు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.