Advertisementt

మహేష్‌ వైఫ్ పై మలైకా సంచలన వ్యాఖ్యలు!

Sun 25th Feb 2018 11:46 AM
malaika arora khan,namrata shirodkar,mahesh wife,sensational comments  మహేష్‌ వైఫ్ పై మలైకా సంచలన వ్యాఖ్యలు!
Malaika Arora Sensational Comments On Mahesh Babu Wife మహేష్‌ వైఫ్ పై మలైకా సంచలన వ్యాఖ్యలు!
Advertisement
Ads by CJ

నమ్రతా శిరోద్కర్‌ మహేష్‌బాబుని వివాహం చేసుకున్న తర్వాత వెండితెరకు దూరమైంది. కానీ 90లలో ఈమె బాలీవుడ్‌లో టాప్‌ మోడల్‌గా, స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అంతేకాదు.. ఈమె వేల కోట్ల ఆస్థికి వారసురాలు. ఈమె మహేష్‌ని వివాహం చేసుకుని తన వాటాగా ఆస్థిలో 1500కోట్లు తెచ్చిందని అంటారు. ఇక నమ్రతా వివాదాలకు ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అచ్చు తన భర్త మహేష్‌లా హుందాగా ఉంటుంది. కానీ ఎప్పుడో జరిగిన ఓ సంఘటనను చెప్పి బాలీవుడ్‌ నటి మలైకా అరోరా నమ్రతా పేరును వార్తల్లోకి తెచ్చింది. 

మలైకా అరోరా.. మహేష్‌బాబు-సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'అతిధి' చిత్రంలో ఓ పాటలో కూడా నర్తించింది. ఇక ఈమె తాజాగా నేహాదూపియా నిర్వహిస్తున్న 'వోగ్‌ బిఎఫ్‌ఎఫ్‌' కార్యక్రమంలో నమ్రతా మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషన్‌ అయ్యాయి. మలైకా మాట్లాడుతూ, నేను మోడలింగ్‌కి వచ్చే సమయానికి నమ్రతాశిరోద్కర్‌, మెహర్‌ జెస్సియా అనే మోడల్స్‌ ఏకచ్చత్రాధిపత్యంగా మోడలింగ్‌ రంగాన్ని ఏలేవారు. వారు ఎంతో సీనియర్స్‌ కావడంతో నా మీద పెత్తనం చెలాయించేవారు. వారు ఓ గ్యాంగ్‌గా మారి నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. కేవలం నేను జూనియర్‌ని కావడం వల్లే వారు అలా ప్రవర్తించేవారు.. అంటూ కామెంట్‌ చేసింది. 

ఇక నమ్రతా.. మహేష్‌బాబుని చేసుకుని సెటిల్‌ కాగా, మెహర్‌ జెస్సియా.. అర్జున్‌ రాంపాల్‌ ని వివాహం చేసుకుని సెటిల్‌ అయింది. అయినా ఇంతకాలం తర్వాత మలైకా అదే పనిగా ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. చివరలో మాత్రం మలైకా అప్పుడు మేం అలా ఉన్నా కూడా ఇప్పుడు వారిద్దరితో నాకు మంచి స్నేహసంబంధాలున్నాయని వాతావరణాన్ని తేలికపరిచింది. మరి దీనిపై మహేష్‌ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది...! 

Malaika Arora Sensational Comments On Mahesh Babu Wife:

Namrata was mean and arrogant: Malaika Arora

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ