తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్‌గా ఎదుగుతున్న వారిలో వేణు ఒకరు. ఈయన చిత్రం శ్రీను వద్ద అసిస్టెంట్‌గా ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చాడు. నటుడు కావాలని బలమైన కోరిక ఉంది కానీ అది ఎంత కష్టమో తెలుసు. ఆ సమయంలో ఆయనకు ఓ ఫిల్మ్‌జర్నలిస్ట్ సాయం చేశాడు. ఆయన ఫొటోని తేజ తీయబోయే 'జై'కి పంపాడు. డ్రస్‌లు లేకపోతే ఐదు జతలు కొనిచ్చాడు. ఇక ఆడిషన్స్‌లో సెలక్ట్ కావడంలో కూడా ఎంతో సాయం అందించాడు. ఆయనకు తనకు దేవుడని వేణు అంటాడు.
ఇక ఈయన.. 'ఎంతో కాలమైంది ఇండస్ట్రీకి వచ్చి, ఎంతో కష్టపడుతున్నాను. కానీ నాతో పాటే వచ్చిన శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి వంటి వారు స్టార్స్ అయ్యారు. మరి నాలో ఏం లోపం ఉంది.? నేను చేస్తున్న తప్పు ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటాను. నాకు మంచి పాత్ర పడాలి. పేరు రావాలి. ఇక నేను తెలంగాణ యాసను బాగా మాట్లాడుతాను. అందులో నాకు ఎంతో ప్రావీణ్యం ఉంది. ఇక 'రుద్రమదేవి' విజయంలో గోనగన్నారెడ్డిగా అల్లుఅర్జున్ పాత్ర హైలైట్. ఈ సన్నివేశాలను రచయిత రాజసింహ రాశాడు. ఆయన బన్నీ వద్దకు వెళ్తూ నువ్వు.. నాతో రా అన్నాడు. భయమేస్తోంది అన్నాను. ఏం లేదు.. నీ గురించి బన్నీకి ఓ లెవల్‌లో చెప్పానులే అని బన్నీ వద్దకు తీసుకుని పోయాడు.
వారు కథ గురించి చర్చిస్తుంటే మద్యలో నేను ఫలానా చోట ఈ డైలాగ్ ఉంటే బాగుంటుంది అని ఓ సౌండింగ్ ఇచ్చాను. బన్నీకి నచ్చేసింది. ఆయన గుణశేఖర్‌కి చెప్పి దానిని సినిమాలో పెట్టించాడు. రెగ్యులర్‌గా షూటింగ్‌కి వెళ్తూ తెలంగాణ యాస విషయంలో హెల్ప్ చేస్తుండే వాడిని. అంత చిన్న సాయానికి బన్నీ ప్రతి చోట నా గురించి చెప్పాడు. హ్యాట్సాఫ్ బన్నీ..' అంటూ చెప్పుకొచ్చాడు వేణు. అయితే బన్నీ ఏమైనా ఈయనకు తన సినిమాలో బ్రేక్‌ఇస్తాడేమో చూడాలి...!