దేవకన్యలా అందరిని మెస్మరైజ్ చేసి సడన్ గా చిన్న వయసులోనే అనంత లోకానికి వెళ్లిపోయిన శ్రీదేవి.. శనివారం అర్ధరాత్రి ఒక హోటల్ లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిన 39 గంటలు గడుస్తున్నా శ్రీదేవి మృత దేహం ఇంకా ముంబై కి చేరుకోలేదు. అయితే శ్రీదేవి మరణవార్త విన్న సినీ పెద్దలు, ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మృతదేహం రాకకోసం పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ముంబయి లోని అనిల్ కపూర్ నివాసం వద్ద వేచి ఉన్నారు. అయితే దుబాయ్ రూల్స్ ప్రకారం శ్రీదేవికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అప్పగించాక.. అక్కడ దుబాయ్ పోలీస్ ల క్లియరెన్స్ వచ్చాకే ఆమె మృతదేహం ఇండియాకి వస్తుంది. అయితే శ్రీదేవి మృతదేహాన్ని ఇక్కడ ముంబై కి తీసుకురావడానికి గాను అంబానీ ఫ్యామిలీ ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ ని ఎరేంజ్ చెయ్యడమే కాదు... ఇప్పటికే దుబాయ్ లో శ్రీదేవి డెడ్ బాడీ కోసం ఆ స్పెషల్ ఫ్లైట్ వెయిట్ చేస్తుంది.
ఇంత జరుగుతుంటే ఇప్పుడు తాజాగా శ్రీదేవి మరణం సహజమరణం కాదా? అలాగే తీవ్ర మానసిక ఒత్తిడి వలనే శ్రీదేవి కన్ను మూసిందా? అనే అనుమానపు ఛాయలు కనబడుతున్నాయి. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేకపోతే, ఉన్నట్టుండి గుండెపోటు రావడం.. క్షణాల్లోనే ఆమె ఈ లోకాన్ని విడిచి పోవడం ఏమిటంటూ కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అయితే శ్రీదేవి మరణించినప్పుడు ఆమె భర్త బోని కపూర్ పక్కనే ఉన్నారనే సమాచారమే మీడియాలో ఉంది. కానీ ఇప్పుడు శ్రీదేవి గత రెండు రోజులుగా దుబాయ్ హోటల్ లో ఒంటరిగానే ఉందని, శ్రీదేవికి గుండెపోటు వచ్చి కిందపడినప్పుడు ఆమె వద్ద ఎవరు లేరని... తర్వాత హోటల్ సిబ్బందే ఆమెను చూసారని... అపుడు బోణీ కపూర్ ఇండియాలోనే ఉన్నాడనే కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
శ్రీదేవి మరణం విషయంలోనూ ఆమె కుటుంబసభ్యుల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె మరణించిన 39 గంటల తర్వాత దుబాయ్ లోని ఆ హాస్పిటల్ క్లియరెన్స్ ఇవ్వడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే శ్రీదేవి మరణం గుండెపోటుతోనే జరిగింది, లేనిది డాక్టర్స్ చెప్పలేదని తెలుస్తుంది. ఇలా అనేక సందేహాలు అందరిని కుదిపేస్తున్నాయి. మరి యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఓ సెలబ్రిటీది సాధారణ మరణం అయినప్పుడు... క్లియరెన్స్ ఇవ్వడానికి దుబాయ్ ప్రభుత్వానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని సందేహపడుతున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె మరణంపై కుటుంబసభ్యులు స్పందించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.