వయసు మీద పడిన సందర్బంలో కాస్త సన్నబడేందుకు దాసరి ఎవరి ఎవరి మాట వినకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. మొదటి సారి ఆపరేషన్ సక్సెస్ అయినా రెండో సారి అన్నవాహికకు దెబ్బ తగిలి మరణించారు. ఇక శ్రీహరి, ఎన్టీఆర్ నుంచి అందరు సన్నబడేందుకు కృత్రిమ పద్దతులు అవలంభించిన వారే. శ్రీదేవి, కరీనా కపూర్, అనుష్కశర్మ వంటి వారు కేవలం వయసు పైబడినా కూడా నాజూకుగా ప్రేక్షకులను అలరించేందుకు శస్త్రచికిత్సలను ఆశ్రయించారు. శ్రీదేవి తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరినీ చేయించుకుంది. ఈ లుక్ వల్ల ఆమె అందం పోయిందని దక్షిణాది వారు భావించి విమర్శిస్తే, ఉత్తరాది వారు మాత్రం ముక్కు ఆపరేషన్ తర్వాత అందం రెట్టింపు అయిందని చెప్పుకొచ్చారు.
ఇక 2009లో కరీనా కపూర్ సైజ్‌జీరోతో తీగలా మారిన విధానం చూసి స్వయం వ్యాయామం, ఫుడ్ కంట్రోల్‌ల ద్వారా కాకుండా శస్త్రచికిత్సల ద్వారా ఎందరో సైజ్‌జీరోలు గా మారారు. ఇక కరిష్మా కపూర్, శిల్పాశెట్టి, కంగనా రౌనత్, శృతిహాసన్, 'బాంబే వెల్వెట్' చిత్రం కోసం అనుష్కశర్మలు కూడా బొటాక్స్, కాస్మోటిక్ సర్జరీలను చేయించుకున్నారు. బొటెక్స్ ద్వారా దొండ పండు వంటి పెదాల కోసం ఆరాటపడ్డారు. ఇక ఇలా అందాలకు శస్త్రచికిత్సలు చేయించుకుని మరణించిన వారిలో మైఖేల్ జాక్సన్ ముఖ్యుడు. ఇంకా ఆపరేషన్‌లు అడ్వాన్స్‌గా లేని రోజుల్లోనే ప్రాణాంతకం అని తెలిసినా కూడా మైఖేల్ జాక్సన్ ఏడాదికి 10 నుంచి 15 శస్త్రచికిత్సలు చేయించుకునే వాడు. ఆర్తిఅగర్వాల్‌లు కూడా ఇలాంటి శస్త్రచికిత్సల వల్లనే అతి తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించారు.
ఇక శ్రీదేవి విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. ఇక ఎప్పుడు సన్నబడాలంటే అప్పుడు సన్నబడే శరీరతత్వం తనదని శ్రీదేవి చెప్పుకునేది. ఒక్కసారిగా బరువు పెరగడం, మరికొంత కాలంలోనే ప్రకృతిసిద్దంగా కాకుండా ఆపరేషన్స్ ద్వారా బరువు తగ్గడం ప్రమాదకరం. ఇక శ్రీదేవి వివాదరహితురాలు. రాజమౌళి 'బాహుబలి'లో ఆమె 'శివగామి' పాత్ర చేయకపోవడం తన అదృష్టమని చెప్పినా కూడా శ్రీదేవి హుందాగానే వ్యవహరించింది.