Advertisementt

బోనీపై అనుమానాలు పెరుగుతున్నాయి!

Wed 28th Feb 2018 11:18 AM
sridevi,boney kapoor,sridevi death mystery,doubts  బోనీపై అనుమానాలు పెరుగుతున్నాయి!
Doubts on Boney Kapoor in Sridevi Death Mystery బోనీపై అనుమానాలు పెరుగుతున్నాయి!
Advertisement
Ads by CJ

శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ వ్యవహారం ఇప్పుడు వింతగా కనిపిస్తోంది. వీరు వెళ్లిన పెళ్లి వేడుక 20వ తేదీనే జరగగా, 24వ తేదీ వరకు శ్రీదేవి ఒంటిరిగా దుబాయ్‌ హోటల్‌లోనే ఎందుకు ఉంది? పెళ్లి అయిన వెంటనే ముంబై వచ్చిన బోనీకపూర్‌ మరలా శ్రీదేవికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని మరోసారి దుబాయ్‌ రావడం వెనుక అసలు కారణాలు ఏమిటి? శ్రీదేవి మరణించిన సమయంలో బోనీ కపూర్‌ దుబాయ్‌లో ఎక్కడ ఉన్నాడు? శ్రీదేవి బాత్రూం నుంచి రాకపోవడంతో 15, 20 నిమిషాల తర్వాత బోనీ బలవంతంగా బాత్రూం తలుపులు తీసి ఆమె మృతదేహాన్ని చూడటం నిజమేనా? ఇక హోటల్‌లో ఉన్న వైద్యులను సంప్రదించకుండా దుబాయ్‌లో ఉంటున్న తన స్నేహితులను పిలిపించే వరకు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? 

ఇక ఈ పెళ్లి వేడుకలో శ్రీదేవికి,బోనీకపూర్‌ మొదటి భార్య మోనా కపూర్‌ బంధులకు మద్య గొడవ జరిగిందని కూడా తెలుస్తోంది. వారి నుంచి ఆమె తీవ్రమైన మానసికవేదనకు, డిప్రెషన్‌కి లోనయి ఆత్మహత్య చేసుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక శ్రీదేవి పలు కాస్మొటిక్ సర్జరీల కారణంగా గుండె పోటు వచ్చి మరణించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె తన కన్నా తన పెద్ద కుమార్తె జాన్వి, చిన్న కూతురు ఖుషీలని హీరోయిన్లుగా నిలబెట్టాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆమె అతిగా మేకప్‌ వేసుకోవడం, కాస్మోటిక్‌ సర్జరీలు నిజమే అయినా కూడా ఆమె నటించిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌', మరీ ముఖ్యంగా 'మామ్‌' చిత్రాలలో ఆమె తన నటనా సత్తాని చాటాలని చూసిందే గానీ గ్లామర్‌ కోసం ఆరాటపడలేదు. 'మామ్‌'లో ఆమె డీగ్లామరైజ్‌డ్‌ పాత్ర చేసింది. ఇలాఈమెకి అందరికీ ఉన్నట్లు అందంపై శ్రద్ద ఉన్నా కూడా తన కుమార్తెలకు, నటిగా తనని తాను నిరూపించుకునే పాత్రలనే జాగ్రత్తగా ఎంచుకుంటోంది. 

ఆమె మృతి గుండెపోటుతో సంభవించలేదని, నీటిలో మునిగిపోవడం వల్ల మరణించిందని దుబాయ్‌లోని ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారంగా చూపుతున్నారు. ఇక శ్రీదేవి మరణం దేని వల్ల జరిగిందో తెలుసుకునే వరకు బోనీ కపూర్‌ దుబాయ్‌ దాటి వెళ్లడానికి వీలులేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బోనీకపూర్‌, శ్రీదేవి ఇద్దరి కాల్‌ డేటాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీదేవి ఫోన్‌ నుంచి ఒక వ్యక్తికి ఎక్కువగా కాల్స్‌ వెళ్లినట్లు సమాచారం సేకరించారు. మరి ఆయన ఎవరు? అనేది తెలియాల్సివుంది...! ఇక ఇప్పటివరకు శ్రీదేవి మరణంపై బోనీకపూర్‌ కనీసం స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది..! 

Doubts on Boney Kapoor in Sridevi Death Mystery:

SRIDEVI DEATH MYSTERY: Prosecution DOUBTS First Autopsy, Seeks Actress Medical History

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ