శ్రీదేవి మరణం విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. పెళ్లి జరిగింది 20 తేదీ అయితే ఆమె 24 వరకు దుబాయ్‌లోనే ఎందుకు ఉంది? మిగిలిన అందరు స్వస్థలాలకు వెళ్లినా, చివరకు బోనీకపూర్ కూడా ముంబై వెళ్లినా కూడా ఆమె దుబాయ్‌లోనే ఎందుకు ఉంది? ఇక దుబాయ్‌పోలీసులు చెప్పినట్లు ఆమె మద్యం సేవించి ఉందని చెబుతున్నారు. ఇక ఫోరెన్సిక్ నిపుణులు గుండె పోటుతో మరణించిందా? లేక నీళ్లలో పడి మరణించిందా? అనే విషయాన్నే చెప్పగలరు గానీ ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి మరణించిందని ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఆమె 22 వ తేదీ నుంచి మరణించిన 24వ తేదీ వరకు ఆమె అసలు హోటల్ రూం నుంచి ఎందుకు బయటికి రాలేదు? హోటల్ సిబ్బంది తలుపులు బద్దలు చేసి చూశారా? లేక ముందుగా బోనీకపూర్ మొదట ఆమెని శవంగా చూశాడా? గతంలో శ్రీదేవికి ఎలాంటి అనారోగ్యం లేదని, మరి ఆమె గుండెపోటుతో మరణించడం బాధగా ఉందని ఆమె మరిది సంజయ్ పూర్ వెంటనే ఎలా చెప్పగలిగాడు?
ఇక 24వ తేదీ సాయంత్రం ముంబై నుంచి బోనీకపూర్ శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయడానికి వెళ్లాడా? లేక మరణ వార్త విన్న తర్వాత వెళ్లాడా? మరి వీటిని దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికీ ఎందుకు చెప్పడం లేదు...? ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌లో పదాల తప్పులు లేకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈమె ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో మాత్రం 'డ్రౌనింగ్' అనే పదాన్ని స్పెల్లింగ్ దోషంగా 'డ్రావింగ్' అనే పదం ఎందుకు వచ్చింది? ఇది పొరపాటేనా.. లేక ఏమైనా మతలబు ఉందా? ఆమెమద్యం సేవిస్తూ అపస్మారక స్ధితిలోని జారుకున్నారా? మరి బాత్రూం వరకు స్పృహలేని ఆమె ఎలా వెళ్లగలిగింది?అసలు ఒక బాత్ టబ్‌లో పడి ఓ పెద్ద వయసు వ్యక్తి మరణించడం జరిగేపనేనా? ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉందా? అనేకోణంలో పరిశోధన సాగిల్సివుంది...!