Advertisementt

ప్రిన్స్‌ లుక్ అదిరింది..!

Thu 01st Mar 2018 03:46 PM
hero prince,new look,surprise,social media  ప్రిన్స్‌ లుక్ అదిరింది..!
Hero Prince Look Latest Sensation ప్రిన్స్‌ లుక్ అదిరింది..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమా కంటెంట్‌ బాగా ఉంటే ఎంత చిన్న సినిమా అయినా, కొత్త నటీనటులైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలోకి నాని, శర్వానంద్‌, విజయ్‌దేవరకొండ, నాగశౌర్య, శ్రీవిష్ణు, నారా రోహిత్‌ వంటి వారు వస్తారు. ఇక తెలుగులో ప్రిన్స్‌ అనే హీరో ఉన్నాడు తెలుసు కదా! ఇంతకీ ఆయన అభిమానులు ప్రిన్స్‌గా ముద్దుగా పిలుచుకునే మహేష్‌బాబు కాదు. మారుతి దర్శకత్వంలో వచ్చిన 'బస్‌స్టాప్‌' చిత్రంలో నటించిన ప్రిన్స్‌. ఈయన ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా అవి ఏమీ ఆడలేదు. 

ఇక కొన్ని చిత్రాలలో ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించాడు. రామ్‌ హీరోగా, కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'నేను.. శైలజ' చిత్రంలో ఆయన క్యారెక్టర్‌ పాత్రని పోషించి మెప్పించాడు. ఇక ఈయన ఎక్కువగా రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చేశాడు. ఇక ఆ మద్య జరిగిన ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన 'బిగ్‌బాస్‌ సీజన్‌ 1'లో కూడా ప్రిన్స్‌ పాల్గొన్నాడు. ఎంతో లవ్లీలుక్‌లో ఉండే ప్రిన్స్‌ తాజాగా భారీగా కండలు పెంచిన శరీరంతో కనిపిస్తున్నాడు. క్యూట్‌గా కనిపించే ఈయన పోస్ట్‌ చేసిన పిక్‌ చూస్తే ఏ స్థాయిలో హాట్‌గా ఉన్నాడో అర్ధమవుతోంది. 

ఇక నేడు నాన్నకు ప్రేమతో, అర్జున్‌రెడ్డి నుంచి రంగస్థలం వరకు ఎన్టీఆర్‌, విజయ్‌దేవరకొండ, రామ్‌చరణ్‌ వంటి వారు మేకోవర్‌ కోసం గుబురు గడ్డాలు పెంచుతున్నారు.ఈ పిక్‌లో కూడా ప్రిన్స్‌ కండలు పెంచిన శరీరంతో పాటు గుబురు గడ్డంలోనే ఉండటం విశేషం. మొత్తానికి ఏదో మంచి చిత్రం కోసం ప్రిన్స్‌ ఇలా మేకోవర్‌ అయ్యాడనిపిస్తోంది. మరి కేవలం మేకోవర్‌ చేస్తేనే చాలదు. చేయబోయే చిత్రంలో కంటెంట్‌ని కూడా సరిగా చూసుకుంటే ప్రిన్స్‌ కూడా దారిలో పడటం పెద్ద విషయం కాదు.

Hero Prince Look Latest Sensation:

HERO PRINCE SURPISES EVERYONE WITH HIS NEW LOOK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ