Advertisementt

నా పేరు సూర్య లో ఆ ఫైట్ వుంటదీ..?

Thu 01st Mar 2018 11:51 PM
allu arjun,naa peru surya naa illu india,interval fight,revealed  నా పేరు సూర్య లో ఆ ఫైట్ వుంటదీ..?
Naa Peru Surya Naa Illu India Latest Updates నా పేరు సూర్య లో ఆ ఫైట్ వుంటదీ..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కొత్తగా ట్రై చేస్తూ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. కానీ జనవరి ఫస్ట్ నుండే నా పేరు సూర్య ఇంఫాక్ట్ అంటూ హడావిడి మొదలెట్టేశాడు. ఆర్మీ లుక్ లో అదరగొడుతున్న అల్లు అర్జున్ లుక్ అందరికి విపరీతంగా నచ్చేసింది. కొత్త దర్శకుడు వక్కంతం వంశి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ వక్కంతం ఏమాత్రం తడబడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనే విషయం నా పేరు సూర్య పిక్ లో అడుగడుగునా అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

ప్రస్తుతం భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఇప్పుడొక న్యూస్ చూస్తుంటే ఇంకా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఒక యాక్షన్ సన్నివేశానికి సంబందించిన సీన్ హైలెట్ అంటున్నారు. ఆ యాక్షన్ సీన్ కూడా సొరంగంలో ఉండబోతుందని... ఈ యాక్షన్ సీన్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు ఉండబోతోందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సొరంగం ఫైట్ నా పేరు సూర్య సినిమాకే హైలెట్ గా ఉండబోతోందనే టాక్ వినబడుతుంది. ఇక ఈ సొరంగం ఫైట్ కోసం నగరం నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ  స్టూడియోస్ లో భారీ సెట్ వేశారట. మరి ఈ ఫైట్ మొత్తం హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందట.

అలాగే అల్లు అర్జున్ - అను ఇమ్మాన్యుయేల్ ల రొమాన్స్ కూడా ఈ సినిమాకి మరో హైలెట్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన నా పేరు సూర్య రొమాంటిక్ పోస్టర్స్ లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ లెవల్లో ఉందొ అర్ధమవుతోంది. విశాల్ - శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా వేసవి కానుకగా మే 4 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Naa Peru Surya Naa Illu India Latest Updates:

Naa Peru Surya Naa Illu India Interval fight Scene Revealed  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ