Advertisementt

'సాక్ష్యం' సినిమాకు భారీ ఆఫర్!

Fri 02nd Mar 2018 09:01 AM
bellamkonda sai srinivas,pooja hegde,saakshyam movie,satelite rights  'సాక్ష్యం' సినిమాకు భారీ ఆఫర్!
Saakshyam Super Record 'సాక్ష్యం' సినిమాకు భారీ ఆఫర్!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'సాక్ష్యం' సినిమాకి అన్ని భలే కలిసొస్తున్నాయి. ఆల్రెడీ హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కులు మొత్తంగా ౮ కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ అయిదున్నర కోట్లకు అమ్ముడు అయిపోయిందంట. దీంతో థియేట్రికల్ రైట్స్ కాకుండా పదమూడు కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

శ్రీవాస్ డైరెక్షన్ లో తొలిసారి నటిస్తున్న శ్రీనివాస్ ఈ సినిమాలో చాలానే కష్టపడ్డాడంట. ఈ మూవీలో 5  భారీ ఫైట్స్ వున్నాయి. మాంచి కమర్షియల్ హంగులు వుంటాయి. ఇప్పటి వరకు అయిన రష్ చూసిన జీ సినిమాస్ వారు ఈ మంచి రేటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. మే రెండో వారంలో రావటానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఈ సినిమాకు ముందు వారమే అల్లు అర్జున్ నాపేరు సూర్యతో వస్తున్నాడు.  సాక్ష్యం మే రెండో వారం కాకుండా మూడో వారంకి వెళ్లే ఛాన్స్ వుంది. లేదా వారం గ్యాప్ తో ఇద్దరు వస్తారేమో చూడాలి.

Saakshyam Super Record:

Saakshyam Satellite Rights Huge Price

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ