ఇటీవలే ఓ మొబైల్ కంపెనీపై హీరో సుమంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఎయిర్‌టెయిల్ సంస్థ తనని ఎంతగా ఇబ్బందులు పెడుతోందో వివరించాడు. ప్రస్తుతం గాయని, యాంకర్ సునీత విషయంలో కూడా అలాగే జరుగుతోంది. మొబైల్ నుంచి 7799328745 నంబర్‌కి కాల్ చేస్తే ట్రూకాలర్ సునీత, ఆంద్రప్రదేశ్ అని చూపిస్తోందని సునీత ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తన పేరు మీద ఎవరో ఈ నంబర్‌ని రిజిష్టర్ చేయించారని, ఈ నెంబర్‌ని దారుణంగా మిస్ యూజ్ చేస్తున్నారని ఆమె వాపోయింది.
ఈ నెంబర్ ద్వారా సెలబ్రిటీలతో చాటింగ్‌లు, మెసేజ్‌లు చేస్తున్నారు. అనుమానం వచ్చిన కొందరు ఆ నెంబర్‌కి కాల్ బ్యాక్ చేస్తే స్పందించడం లేదు. ఈనెంబర్ తనదా? కాదా? అనే అనుమానం తీర్చుకోవడం కోసం ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్నేహితులు తనకు ఫోన్ చేసి డౌట్ తీర్చుకుంటున్నారని, తన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్, తన శ్రేయోభిలాషుల కోసం ఈ పోస్ట్ చేస్తున్నాను. ఇది నా నెంబర్ కాదు.. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది. ఇంత జరిగినా ఆమె పోలీస్‌లకు ఎందుకు కంప్టైంట్ చేయలేదనేది కొందరి అనుమానం. ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉండటంతో సైబర్ పోలీసులు ఎంతో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇటీవల యాంకర్, నటి శ్యామల కూడా ఎవరో నటించిన బ్లూఫిల్మ్‌లో ఆ ఫేస్‌ని మార్ఫింగ్ చేసి తన ఫేస్‌ని పెట్టారని, అది తన భర్తేచూశాడని, కానీ ఆయన కూడా ఇండస్ట్రీ వ్యక్తికావడంతో అర్ధం చేసుకున్నాడని, అదే ఇంకెవరైనా అయితే తన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేసింది. నిజంగానే సాంకేతిక విప్లవం రెండు అంచులున్న కత్తి అనే చెప్పుకోవాలి.