ఈమధ్య అల్లుఅర్జున్ ఏ చిత్రం చేసినా అందులో లీనమైపోయి, మేకోవర్‌లతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆయన కమిట్‌మెంట్‌ని చూసి అందరు ఫిదా అవుతున్నారు. పాత్ర కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా ఆయన నటిస్తుండటంతోనే యావరేజ్ చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. పవన్‌లాగా మనసు ఎక్కడో పెట్టి ఏదో తూతూ మంత్రంగా నటించకుండా 150 చిత్రాలు దాటిన చిరంజీవి చూపిస్తున్న కమిట్‌మెంట్, కష్టమే బన్నీలో కనిపిస్తోంది. ఆయనకు మెగా ఫ్యాన్స్‌నే కాదు.. ఇతర న్యూట్రల్ ఫ్యాన్స్‌ని కూడా ఆయనకు దగ్గర చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ, సుకుమార్ తర్వాత మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. లగడపాటి శ్రీధర్, బన్నీవాసు, నాగబాబు నిర్మాతలుగా రూపొందుతున్న 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'కి చెందిన ఫస్ట్ ఇంపాక్ట్‌తో పాటు రెండు పాటలు, పోస్టర్ ఇంపాక్ట్ వంటి వాటి ద్వారా ఈ చిత్రంపై ఇప్పటినుంచే ప్రమోషన్స్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లుక్‌లో బన్నీ ఊరమాస్ లుక్‌తో అదరగొడుతున్నాడు. నోటిలో సిగార్, కంటిపై చిన్న గాయం, మిలటరీ వారి స్టైల్‌లో ఉండే హెయిర్‌స్టైల్, కళ్లద్దాలు, మిలటరీ జీపులో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని ఆయన ఇస్తున్న లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది 'ఇక్కడ కాదు...బోర్డర్‌లో చనిపోతా' అనే డైలాగ్‌తోనే కేక పెట్టించిన బన్నీ మరోసారి 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' ద్వారా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు.
ఇక థియేటర్ల సమ్మె తర్వాత మొదట విడుదలయ్యే చిత్రం మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ కూడా యంగ్ సీఎంగా అదరగొట్టడానికి వస్తున్నాడు. ఇలా ఒకవైపు 'భరత్ అనే నేను', మరో వైపు రజనీకాంత్ 'కాలా'లను మించి విజయం సాధించాలంటే ఈ చిత్రం అద్భుతంగా ఉంటేనే సాధ్యం. మరి ఈ ముగ్గురి వార్ ఒకేరోజు కాకపోయినా ఒక్కో దానికి వారం గ్యాప్ ఉన్నా కూడా చివరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేది ఏది? అనేది తెలియాలంటే మే 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిఉంది...!