కమల్‌హసన్ వ్యక్తిత్వం, ఆయన భావాలు దాదాపుగా తెలుగులో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని పోలి ఉంటాయి. కమల్ ఆ విషయాన్ని నేరుగానే చెబుతాడు. తను స్వేచ్చాజీవిని అని, తనకు పెళ్లి, సంసారాలు పడవని, తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ప్రపంచంలోని అన్ని జీవుల మాంసాన్ని తిన్నానని చెబుతాడు. ఇక ఈయన వివాహ సంబంధాలు కూడా వాణి గణపతి, సారికా, గౌతమి, అంతకు ముందు శ్రీవిద్య ఇలా ఎప్పుడు ఏదో సంచలనం సృష్టిస్తూనే ఉంటాడు. తాను దేవుడిని, మతాలను నమ్మనని, రోజు గుడి ముందు అడుక్కునే బిచ్చగాడికి మేలు చేయని దేవుడు, ఎప్పుడో వీలున్నప్పుడు దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే నిన్ను ఆయన కరుణిస్తాడా? అని ప్రశ్నిస్తాడు. మతాచారాలను, భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి వాటిపై కూడా ఆయన పలు కామెంట్స్ చేస్తాడు.
ఇక తాజాగా ఆయన రాజకీయాలలోకి వచ్చి పార్టీని పెట్టాడు. ఇదే సమయంలో ఆయనతో సహజీవనం చేసి, విడిపోయిన గౌతమి కమల్ తీసుకున్న కొత్త కమిట్‌మెంట్స్ తనకు నచ్చలేదని, దాని వల్ల తన పరువు కూడా పోతుందని భావించి విడిపోయానని చెప్పడమే కాదు... విడిపోయి ఇంత కాలం అయినా ఎప్పుడు చెప్పని విధంగా ఆయన రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతనే ఆయన చిత్రాలకు తాను కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని బహిరంగంగా విమర్శించింది. దాంతో ఈ విషయంలో ఆమె వెనుక బిజెపి ఉందని వార్తలు వస్తున్నాయి.. ఇక కమల్‌ని డీగ్రేడ్ చేయడానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మీడియా తాజాగా శ్రీదేవి మరణించడంతో ఆమెకు కమల్‌కి ఎఫైర్ ఉందని, ఆమెని కమల్ కూడా మోసం చేశాడని వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి కమల్‌హాసన్ స్పందించాడు.
శ్రీదేవి నాకు సోదరి వంటిది. ఆమెతో పాటు నేను కూడా బాలనటునిగా ఆమె తల్లి చేతిముద్దలు తిన్నాను. దయచేసి ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని కోరుతున్నాను.. అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కమల్‌ని రాజకీయంగా కాకుండా వ్యక్తిగత ఇష్యూలతో ఇబ్బంది పెట్టాలని ఇతర పార్టీలు చూస్తున్నట్లు ఉన్నాయి. రేపు రజనీ ఇండస్ట్రీకి వచ్చినా ఆ మీడియా సంస్థలు రజనీ గురించి కూడా ఇలాగే టార్గెట్ చేస్తాయనేది ఖచ్చితంగా అర్ధమవుతోంది. ఇక శ్రీదేవి, కమల్‌హాసన్ కాంబినేసన్‌లో వచ్చిన 'ఎర్రగులాబి, ఆకలిరాజ్యం, వసంత కోకిల'లతో పలు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.