తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న స్టార్స్‌గా అజిత్, విజయ్‌లను చెప్పాలి. ఇక రజనీ అంత పెద్ద స్టార్ అయివుండి ఆయనతో చిత్రాలు తీయడానికి ఎవరైనా క్యూలో నిలుచునే పరిస్థితుల్లో ఆయన 'కబాలి'ని, తాజాగా 'కాలా'ని రంజిత్‌పా అనే యంగ్ డైరెక్టర్‌తోనే చేస్తున్నాడు. ఇక '2.0, కాలా' తర్వాత రజనీ చివరగా నటించే చిత్రానికి 'పిజ్జా, ఇరైవి' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించనుండటం, ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీగా నిర్మించనుండటం చూస్తే నాటి రవికుమార్, పి.వాసు, సురేష్ కృష్ణల వంటి వారిని కాదని, తనని కొత్తగా, వినూత్న కథాంశాలు, పాత్రలలో చూపించాలని తహతహలాడే యంగ్ డైరెక్టర్స్‌కే రజనీ ఓటేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఇక అజిత్, విజయ్‌లు కూడా తమ కెరీర్‌లో యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేశారు. 'రాజురాణి' ఫేమ్ అట్లీతో విజయ్ అనుబంధం సాగుతుండగా, మురుగదాస్, ఎస్.జె.సూర్య వంటి స్టార్ డైరెక్టర్స్‌ని పరిచయం చేసిన ఘనత అజిత్‌కి చెందుతుంది. ఇక అజిత్ శివకి కూడా వరుసగా మూడు చిత్రాలకు చాన్స్‌లు ఇచ్చాడు. 'వీరం, వేదాళం, వివేగం' తర్వాత నాలుగో చిత్రంగా మరలా ఆయన్నే నమ్మి 'విశ్వాసం' చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రం తర్వాత అజిత్ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన డైరెక్టర్ కూడా ఖరారయ్యాడని సమాచారం.
'చదురంగ వెట్టై, చతురంగ వెట్టై 2'లతో పాటు 'ధీరం అధిగరం ఒండ్రు' చిత్రాలను తెరకెక్కించిన వినోద్ దర్శకత్వంలో నటించడానికి అజిత్ ఓకే చెప్పాడని సమాచారం. మరోవైపు విజయ్ నటించే 63వ చిత్రానికి కూడా వినోదే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఉప్పు నిప్పులా ఉండే అజిత్, విజయ్ ఫ్యాన్స్‌లను వినోద్ ఎంత వరకు సంతృప్తి పరుస్తాడు? డైరెక్టర్స్ స్టార్స్ స్థాయిని పెంచగలరు గానీ హీరోలు డైరెక్టర్స్ స్థాయిని పెంచలేరనే విషయాన్ని వినోద్ మరోసారి రుజువు చేస్తాడా? లేదా? అన్నది వేచిచూదాల్సివుంది...!