డైరెక్టర్ తేజ - వెంకటేష్ సినిమా ఆఫీసియల్ గా మొదలైంది కానీ... ఇంతవరకు సెట్స్ మీదకెళ్లలేదు. అన్ని బావుంటే... ఈ నెల 12 నుండి తేజ - వెంకీల సినిమా సెట్స్ మీదకెళుతుందనే సమాచారం అయితే ఉంది. మరి పూర్తి స్క్రిప్ట్ వర్క్ తోపాటు.. నటీనటుల ఎంపిక విషయంలోనూ తేజ ఒక క్లారిటీకి వచ్చాడని.... ఇప్పటికే వెంకటేష్ పక్కన హీరోయిన్ గా శ్రియ శరణ్ ని ఎంపిక చేశాడు తేజ. మరి ఈ సినిమా కోసం శ్రియ శరణ్ 60 లక్షల పారితోషకం కూడా తీసుకుంటుందనే టాక్ ఉంది. మరి ఆట నాదే -వేట నాదే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది.
మరి మొదటి హీరోయిన్ ని ఎంపిక చెయ్యడానికే చాలా టైం తీసుకున్న తేజ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ విషయంలో మాత్రం స్పీడుగా వున్నాడంటున్నారు. వెంకీ పక్కన సెకండ్ హీరోయిన్ గా అ! సినిమాలో మంచి నటనతో అదరగొట్టిన ఈషా రెబ్బాని సెలెక్ట్ చేశాడంటున్నారు. మరి ఈషా రెబ్బా అ! సినిమా కన్నా ముందు చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమెకి ఓ... అన్నంత గుర్తింపు ఏ సినిమా కూడా తీసుకురాలేదు. కానీ నాని నిర్మాతగా తెరకెక్కిన అ! సినిమా మాత్రం ఈషా రెబ్బాకి బాగానే గుర్తింపు తెచ్చిపెట్టింది. అ! సినిమాలో ఈషా లుక్స్ పరంగా అదరగొట్టేసింది.
అయితే ఇలాంటి టైంలో సీనియర్ హీరో వెంకీ పక్కన హీరోయిన్ గా అంటే మళ్ళీ యంగ్ హీరోల పక్కన ఛాన్స్ లు రావేమో అని ఈషా భయపడుతుంది. మరి ఈషాకి ఈ భయం ఉండడం సహజమే. కాకపోతే తేజ - వెంకీ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఈషాని తీసుకోలేదని... కేవలం 10 నిమిషాల గెస్ట్ రోల్ కోసమే అని ఈషాని ఒప్పించే ప్రయత్నంలో తేజ ఉన్నాడట. చూద్దాం వెంకీ పక్కన ఫస్ట్ హీరోయిన్ శ్రియ ఒకే చెయ్యడానికే చాలా టైం తీసుకున్న తేజ.. ఇప్పుడు ఈ 10 నిమిషాల కేరక్టర్ కోసం ఎంతటి టైం తీసుకుంటాడో చూడాలి.