Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌, రేణు ఇద్దరి తప్పు ఉంది!

Mon 05th Mar 2018 09:24 PM
renu desai,pawan kalyan,fans,fire,social media  పవన్‌ ఫ్యాన్స్‌, రేణు ఇద్దరి తప్పు ఉంది!
Renu Desai Fires on Pawan kalyan Fans పవన్‌ ఫ్యాన్స్‌, రేణు ఇద్దరి తప్పు ఉంది!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఎవరైనా రాజకీయాలలోకి వస్తే ప్రత్యర్దులు వారి గత జీవితాలను, వ్యక్తిగత జీవితాలను టార్గెట్‌ చేస్తూ ఉంటారు. ఎమ్జీఆర్‌ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన ఎఫైర్స్‌, ఎన్టీఆర్‌ పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఆయన సినీరంగాన్ని డిక్టేట్‌ చేసిన విధానం, చిరంజీవి రాజకీయాలలోకి రాగానే పవన్‌కళ్యాణ్‌ మొదటి భార్య నందిని, అప్పటికి కేవలం సహజీవనమే చేస్తున్న రేణూదేశాయ్‌ విషయం టార్గెట్‌ అయ్యాయి. ఇక చిరంజీవి చిన్నకూతురు వ్యవహారం కూడా అలాంటి రంగే పులుముకుంది. దీంతో చిరంజీవి సైతం మౌనంగా తన చిన్నకూతురి విషయాన్ని సెటిల్‌చేసి, పవన్‌తో రేణుదేశాయ్‌కి పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేయించాడు. ఇక కమల్‌హాసన్‌ రాజకీయాలలోకి రావడమే మొదలు ఆయన తనకు రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాడని, శ్రీవిద్య, వాణి గణపతి, సారికా, గౌతమిలను మోసం చేశాడని, హిందు వ్యతిరేకి అనేగాక మరణించిన శ్రీదేవితో కూడా ఆయనకు ఎఫైర్‌ అంటగట్టారు. ఇక రజనీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా సిల్క్‌స్మిత వ్యవహారం, ఆయన తన కెరీర్‌ మొదట్లో గడిపిన విచ్చలవిడి జీవితం, నిర్మాతలకు, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఆయన మోసం చేశాడనే విమర్శలు రావడం ఖాయం. 

ఇక ఆయనకు  చదువురాని విషయం, రాజ్యాంగం తెలియని విషయం, ఆయన మరాఠి, కన్నడిగుడు వంటి అంశాలు తెరపైకి వస్తాయి. ఇక ఇప్పుడు పవన్‌ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆయన్ను విమర్శించేందుకు ఏమీ దొరకని వారు ఆయన మూడు పెళిళ్లు, 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడు, అజ్ఞాతవాసి'ల ద్వారా నష్టపోయిన బయ్యర్ల విషయాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. అయితే పవన్‌ ఇప్పటి వరకు తన మాజీ భార్యల విషయంలో ఏనాడు కామెంట్స్‌ చేయలేదు. కానీ పవన్‌ నుంచి ఎందువల్ల విడిపోయింది? కారణం ఎవరు? అనే విషయాలను పక్కన పెడితే పవన్‌ ఏనాడూ రేణు విషయం ప్రస్తావించలేదు. కానీ రేణుదేశాయ్‌ మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌ని టార్గెట్‌ చేస్తూ, ఆయనలేని జీవితాన్ని వర్ణిస్తూ వస్తోంది. దీంతో కత్తిమహేష్‌, ఇతర ప్రత్యర్ధులు తన మాజీ భార్యకే న్యాయం చేయని వాడు రాష్ట్రంలోని మహిళలకు ఏమి న్యాయం చేస్తాడు? తన బయ్యర్లను, నిర్మాతలను మోసగించిన వాడు రాష్ట్ర ప్రజలకు ఏమి సాయం చేస్తాడు? అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై పవన్‌ ఫ్యాన్స్‌ రేణుదేశాయ్‌ని మీరు మీ బతుకు మీరు బతకండి.. అనవసరంగా పవన్‌ విషయాలలోకి ఎంటర్‌ కావద్దు. మీ వల్లే రాజకీయ పార్టీలకు పవన్‌ టార్గెట్‌ అవుతున్నాడు. సగం సగం నాలెడ్జ్‌తో మీరు ట్వీట్స్‌ చేస్తారు. వాటిని మీడియా హైలైట్‌ చేస్తుంది. దయచేసి తమరి పని తాము చూసుకోండి...పవన్‌కి సంబంధించిన ఏ విషయాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేయవద్దని కోరారు. 

దానిపై రేణుదేశాయ్‌ పవన్‌ ఫ్యాన్స్‌పై మండిపడింది. నేను పోస్ట్‌ చేసిన ఓ కవిత పవన్‌ని ఎలా టార్గెట్‌ చేస్తోంది? మీ పని మీరు చూసుకోండి. నా సోషల్‌ మీడియాలోకి ఎంటరై ఏదో ఒకటి పోస్ట్‌ చేస్తూ, నన్ను కామెంట్‌ చేయకండి...! ఈ ట్వీట్‌ని కూడా మీరు రాద్దాంతం చేస్తారని నాకు బాగా తెలుసు... అని తెలిపింది. ఏదైనా విభేధాలు, జ్ఞాపకాలు, చెప్పాల్సిన సంగతలు ఉంటే సోషల్‌మీడియా లేదా మీడియా ద్వారా కాకుండా పర్సనల్‌గా కలిసి మాట్లాడటమో... ఫోన్‌ చేయడమో చేయాలి గానీ ఇలా రేణుదేశాయ్‌, పవన్‌ ఫ్యాన్స్‌లు ఉప్పులో నిప్పులా ఉంటే అందరికీ ఇబ్బందే.

Renu Desai Fires on Pawan kalyan Fans:

Renu Desai Fires On Pawan Kalyan Fan In Social Media 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ