శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన 2.ఓ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనేది స్పష్టత లేదు. కానీ ఆ సినిమా మీద ఉన్న హైప్ మామూలుది కాదు. 2.ఓ ఫస్ట్ లుక్ కే జనాలు వెర్రెత్తిపోతే... 2.ఓ మేకింగ్ వీడియో చూసి శంకర్ పనితనంతో పాటే.. రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్, హీరోయిన్ అమీ జాక్సన్ లు ఎలా వున్నారో.. అనేది తనివితీరా చూడడమే కాదు... ఆ వీడియోతో సినిమాపై మరికాస్త అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది 2.ఓ సినిమా పాటలను విడుదల చేసిన రోబో టీమ్ 2.ఓ టీజర్ ని ట్రైలర్ ని ఈ ఏడాది మొదట్లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్దతతో... వీటిని ఎప్పుడు విడుదల చేద్దామనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారు.
ఇలాంటి టైం లోనే 2.ఓ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియోను ఎవరో ఇంటర్నెట్ లో లీక్ చేశారు. 2.ఓ టీజర్ వీడియో లీక్ అంటూ నెట్ లో కనబడిన 2.ఓ సినిమా దృశ్యాలతో రోబో టీమ్ షాక్ అయ్యింది. మరి ఎవరో ఈ సీన్స్ ని లీక్ చేసినట్టుగా కనపడటం లేదు. ఎందుకంటే ఆ సీన్స్ లీకైన కంప్యూటర్ మీద ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో అస్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది 2.ఓ టీమ్ లో ఎవరో కావాలనే లీక్ చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఇలా 2.ఓ సినిమా సీన్స్ లీక్ చేసి సినిమా మీద మరి కాస్త హైప్ క్రేజ్ తీసుకురావాలని టీమ్ ఉద్దేశ్యం అంటున్నారు కొందరు.
ఎందుకంటే 2.ఓ సినిమా విడుదల వాయిదా పడుతున్న తరుణంలో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుందనే భయంతోనే ఇలా లీక్ చేసి ఉంటారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుండగా... 2.ఓ టీమ్ మాత్రం ఈ లీకులను సీన్స్ ని యూట్యూబ్ నుండి తొలిగించాలని.. అలా లీక్ చేసిన వారిని పట్టుకోవాలని తమిళనాడు పోలీస్ లను కోరిందట.
అయితే ఈ 2.ఓ లీకులపై రజిని కూతురు సౌందర్య ఫైర్ అయ్యింది. కేవలం కొన్ని నిమిషాల ఆనందం కోసం నిర్మాతల కృషి, మనోభావాలు, వారి శ్రమను నీరుగార్చే మతిలేని చర్యగా ఆమె గట్టిగానే స్పందించింది. అలా ఇంటర్నెట్ లో లీక్ చేయడం క్షమించరాని నేరంగా ఆమె ట్వీట్ లో పేర్కొంది.