Advertisementt

మంచు ఫ్యామిలీ గొప్పతనం గురించి చెప్పింది!

Tue 06th Mar 2018 01:52 AM
geeta singh,kitakitalu,heroine,interview,manchu family  మంచు ఫ్యామిలీ గొప్పతనం గురించి చెప్పింది!
Geetha singh about Manchu Family Greatness మంచు ఫ్యామిలీ గొప్పతనం గురించి చెప్పింది!
Advertisement
Ads by CJ

లేడీ కమెడియన్‌ గీతాసింగ్‌ గురించి తెలియని వారు ఉండరు. కల్పనారాయ్‌ తర్వాత గీతాసింగ్‌ ఒబేసిటీపై మన దర్శకులు కామెడీ సృష్టిస్తుంటారు. వాస్తవానికి ఈమె మొదటి చిత్రం తేజ దర్శకత్వంలో నవదీప్‌ హీరోగా పరిచయమైన 'జై'. ఇందులో ఆమె హీరోయిన్‌కి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసింది. మాతృభాష హిందీ అయినా చక్కగా తెలుగులో మాట్లాడుతుంది. ఆమధ్య ఆమెకి మరో కమెడియన్‌ సుమన్‌శెట్టికి మధ్య ఎఫైర్‌ ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఆమె ఎంతో బాధపడింది. సుమన్‌శెట్టి నాకు సోదరుడు వంటి వాడు. ఆయనకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటివి రాస్తే ఆయన ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో గమనించండి అంటూ వేడుకుంది. 

ఇక ఈమెని ఈవీవీ సత్యనారాయణ 'కితకితలు' చిత్రంలో హీరోయిన్‌ పాత్రకి తీసుకున్నాడు. ఈవీవీ ఉన్నంత కాలం ఈమెకి మంచి అవకాశాలే వచ్చాయి. ఇక ఈమె యాక్సిడెంట్‌ వల్ల మంచానికి పరిమితం కావడం వల్ల లావు పెరిగానని, ఇప్పుడు తగ్గుదామంటే నాకొచ్చే పాత్రలు పోతాయేమో అని భయపడుతున్నానని చెబుతుంటుంది. ఇక ఈమె తండ్రి, సోదరుడు ఇద్దరు మరణించారు. దాంతో ఈమె పెళ్లి చేసుకోకుండా తన అన్నయ్య పిల్లలనే పెంచుకుంటోంది. ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఓ సారి షూటింగ్‌లో విషయాన్ని మంచు విష్ణుకి చెప్పిందట. ఆయన వెంటనే తిరుపతి వద్ద గల మోహన్‌బాబు స్కూల్‌ శ్రీవిద్యానికేతన్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇప్పించి, అక్కడ చదివిస్తున్నాడు. 

వాస్తవానికి మంచు విష్ణు నన్ను గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఎప్పుడు కనిపించినా గౌరవంగా మాట్లాడుతారు. ఈ రోజు నా అన్నయ్య పిల్లల చదువు విషయంలో హ్యాపీగా ఉన్నానంటే అది మంచు ఫ్యామిలీ పుణ్యమే అని ఆమె చెప్పుకొచ్చింది. 

Geetha singh about Manchu Family Greatness:

Kitakitalu Heroine Geeta Singh  Reveals About Manchu Family In An Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ