కేవలం 26 సెకన్ల టీజర్‌తోనే సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె గురించి గూగుల్ సెర్చ్‌లో సన్నిలియోన్ కన్నా ఎక్కువగా చూస్తున్నారు. దీంతో ఈమెకి ఒకేసారి దేశవ్యాప్త గుర్తింపు రావడంతో ఆమె ఎంతో హ్యాపీగా ఫీలవుతూ, ఉబ్బితబ్బిబవుతోంది. ఈమెని తమ చిత్రంలో నటింపజేయాలని మలయాళ, తమిళ్, తెలుగు, కన్నడ మేకర్స్ మాత్రమే కాదు... బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ కూడా పోటీ పడుతున్నారు. కానీ ఈమె నటిస్తున్న మొదటి చిత్రం 'ఒరు ఆధార్ లవ్' దర్శకుడు ఒమర్‌లల్లుకి ఈమె రెండో చిత్రం కూడా చేస్తానని, మొదటి చిత్రం ముందే ఒప్పుకుంది. దాంతో లక్షలు చెల్లిస్తామని నిర్మాతలు అంటున్నా..ఆమె మాత్రం ఇంకాఎవ్వరికీ ఓకే చెప్పలేదు.
ఇక ఈమె పాపులారిటీ ఎంతగా పెరిగిదంటే ఇండియాలోనే అందరికీ గుర్తుండిపోయే 'అమూల్' బటర్ ప్యాక్‌పై ఈమె కన్నుగీటే విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కేరళలోని సీపీఎం యంగ్ వింగ్ ఈమె ఫొటోతో కూడిన పోస్టర్స్‌లో త్వరలో జరగబోయే తమ సమావేశాలకు రావాలని పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక ఈమె గురించి 'ప్రేమమ్'తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుని, 'ఫిదా'తో ఫిదా చేసిన బ్యూటీ సాయిపల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. స్టార్‌డమ్ తెచ్చుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం కష్టం. మొదటి చిత్రం విడుదల కాక ముందే సినిమా చాన్స్‌లు అందుకుంటున్న ప్రియా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇకపై ఎంతో శ్రద్దతో కొత్త చిత్రాలను ఆమె ఒప్పుకోవాలి. పారితోషికం కన్నా కథ, కథనాలు, పాత్రలను చూసి సినిమాలను ఎంపిక చేసుకోవాలి... అని చెప్పుకొచ్చింది.
సాయిపల్లవి ప్రస్తుతం అదే తరహాలో తన కెరీర్‌ని తీర్చిదిద్దుకుంటూ ప్రియాకి చేసిన సూచనలు కూడా మంచివేనని చెప్పాలి. ఎంతైనా సీనియర్. అదే కోవకి చెందిన నటి కావడంతో సాయిపల్లవి మాటలు ప్రియా ఆచరిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.