రంగస్థలంలో చాలా విషయమే ఉంది. రామ్ చరణ్ చిట్టిబాబుగా ఎలా ఉంటాడో... సమంత పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిలా ఎలా ఉంటుందో అనే విషయాలు పాట పాటకి, టీజర్ టీజర్ కి 'రంగస్థలం' ఫోటో ఫోటోకి తేటతెల్లమైపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న రంగస్థలం పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. రంగస్థలం లిరికల్ సాంగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ సినిమాపై సుకుమార్ కావాల్సినన్ని అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మర్కెట్ లోకి విడుదలైన 'రంగమ్మా... మంగమ్మా' సాంగ్ ఉర్రుతలూగిస్తోంది.
సమంత అలియాస్ రామలక్ష్మి చిట్టిబాబు అలియాస్ రామ్ చరణ్ ని ఉద్దేశించి ఈ 'రంగమ్మా.. మంగమ్మా' పాటేసుకుంది. మాంచి మాంటేజ్ సాంగ్ గా సాగిన ఈ సాంగ్ అందరికి ఇట్టే ఎక్కేస్తుంది. ఎంఎం మానసి పాడిన ఈ పాటలో 'రంగమ్మ.. మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు'... అంటూ సమంత బుంగమూతి పెట్టుకుని.... చరణ్ ని ఉద్దేశించి పాడుతూ సందడి చేస్తోంది. మరి సమంత పల్లెటూరి పడుచులా లంగా ఓణిలో ఎలా అందాలు ఆరబోస్తోందో అనుకుంటే... ఈ పాటలో సమంత, రామ చరణ్ ఫొటోస్ ని వీడియో ప్లేలో చూపించారు. మరి ఈ వీడియో ప్లే లో సమంత బొడ్డుకిందకి చీర కట్టి అందాలను ఇలా కూడా చూపెట్టొచ్చు అన్నట్టుగా హాట్ హాట్ గా కనబడుతుంది.
మరి ఇప్పటికే విడుదలైన 'ఎంత సక్కగున్నావే, రంగ రంగ రంగస్థలాన' పాటలు ఇంకా మార్కెట్ లో హల్చల్ చేస్తుంటే ఇప్పుడు 'రంగమ్మ .. మంగమ్మ' పాట కూడా అందరి మనసులని దోచేస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మరో 22 రోజుల్లోనే అంటే మార్చ్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.