సమాజానికి ఉపయోగపడే ఒక సమస్యకి పరిష్కారాన్ని చూపుతూ ఒక చక్కటి మెస్సేజ్ ని అందించడమే ధ్యేయంగా సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివ టాప్ లో ఉంటాడు. అంతేకాకుండా యూత్ ని ఏదైనా సామజిక అంశంపై ఆలోచించజేసే కథలను ఎంచుకుని సినిమాలను తెరకెక్కిస్తాడు కొరటాల. అలాగే సమాజానికి ఉపయోగపడుతుంది అంటే గొంతెత్తి ఎవరికీ భయపడకుండా తన మనుసులో మాటను స్పష్టంగా చెప్పగల వ్యక్తి. మాములుగా సామాజిక సమస్యలంటే కొంతమంది సినిమా తారలు ఆలోచించి స్పందించడం చూస్తూనే ఉంటాం. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు కూడా సినిమా తారలు చాలామంది తమ శక్తి కొలది సహాయం చేయడమే కాదు... ఆ సమస్య పరిష్కరణకి కొన్ని షోస్ నిర్వహించి ఆ డబ్బుతో సహాయం చేస్తుంటారు.
మరి కొరటాల మాత్రం ఒక రైటర్ కదా.. అందుకే తప్పులను ఎత్తి చూపుతూ మాటలతో కోసేస్తుంటాడు. మొన్నటికి మొన్న ప్రత్యేక హోదాకి మంగళం పాడిన మోడీకి సూటిగా... ఇచ్చిన మాటకు కట్టుబడి మోడీ మ్యాన్ అనిపించుకోవాలని ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. కొరటాల ట్వీట్ కి అనేకమంది ముక్తఖంఠంతో మద్దతు తెలిపారు. కానీ కొంతమంది మాత్రం సెటైర్స్ కూడా వేశారు. పీఎం అయిన మోడీని అంత మాటన్న మీరు ఏపీ సీఎం చంద్రబాబుని ఎందుకు అనలేకపోతున్నారంటూ కొరటాల మీద విరుచుకు పడుతున్నారు. మరి గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా మీద ఇంత రగడ జరుగుతుంటే.. మీకిప్పుడే రాష్ట్ర సమస్య గుర్తొచ్చిందా అంటూ సెటైరికల్ డైలాగ్స్ పేలుస్తున్నారు.
అలా తన మీద సెటైర్స్ వేసిన వారికి ధీటుగా కొరటాల కూడా గట్టి సమాధానమే ఇస్తున్నాడు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని.. అసలు తనకి ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని.... ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఒక పౌరుడిగా స్పందించడం తన బాధ్యత అని... ధీటైన సమాధానం ఇస్తుంటే... కొరటాల గట్టివాడే అనిపిస్తుంది. మరి మహేష్ తో 'భరత్ అనే నేను' సినిమాని కూడా ఒక మెస్సేజ్ ఓరియంటెడ్ ఫిలింగానే తీర్చిదిద్దుతున్నాడని మాత్రం భరత్ టీజర్ తో పూర్తిగా అర్ధమయ్యింది.