ఏపీకి ప్రత్యేక హోదా విషయం, నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్న విధానంపై ఏపీ ప్రజల్లో, మరోవైపు తెలంగాణ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పలువురి మద్దతు పెరుగుతోంది. ఇక మొన్నటి ఎన్నికల్లో ఏపీలో బిజెపిలో చేరి, సమైఖ్యాంద్ర, ప్రత్యేకహోదా ఉద్యమాలలో సినీ నటుడు శివాజీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.. ఇక ఏపీకి, మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్టాలు నా రెండు కళ్లు అని ఏపీకి మరీ ముఖ్యంగా నెల్లూరీయుడైన వెంకయ్యనాయుడు వీలున్నప్పుడల్లా సెలవిస్తూనే ఉంటాడు. రెండు మూడు నెలలకు ఒకసారైనా తెలుగు గడ్డకి రాకపోతే తనకేదో పోయిందనేంత బాధగా ఉంటుందని అంటాడు. ఇక ఏపీకి రెవిన్యూలు, రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సంతోషకర వార్తలు, పలు జాతీయ విద్యాసంస్థలు, స్మార్ట్ సిటీలు, అమృత్ సిటీలు తెస్తూ ఉంటానని డంబాలు పలుకుతూ ఉంటాడు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే దమ్ములేని ఈయన చంద్రబాబుకి అనుకూలం, తెలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కు కావడంతో మోదీ ఆయనను పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చొబెట్టి ముందుచూపుతో వ్యవహరించాడు. ఇక ప్రత్యేకహోదా గురించి, ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి వెంకయ్యది మాట్లాడలేని స్థితి.. పరిస్థితి. ఇక విషయానికి వస్తే తాజాగా శివాజీ వెంకయ్యకి కొత్త మెలిక పెట్టాడు. టిడిపికి చెందిన కేంద్రమంత్రులు రాజీనామా చేసి ఉపయోగం లేదని, అయినా ఇది మంచి పరిణామమేనని తేల్చిచెప్పారు. ఇక ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే ఒకే మార్గం ఉందని, ఏకంగా ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు తన పదవికి రాజీనామా చేస్తే ఏపీ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై ఒకరోజులో ప్రత్యేకహోదా వస్తుందని తేల్చివేశాడు. ప్రత్యేకహోదా ఎవరు తెచ్చారనేది ముఖ్యం కాదు. ఎవరు హీరో అనేది పట్టించుకోవాల్సిన విషయం కాదు. వెంకయ్య గనుక ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తే ఏపీలో ఆయనే హీరో అవుతాడు. ఈ విషయం వెంకయ్యకి చేరువయ్యేలా చూడండి...ఈ విషయం ఆయనకు ఎవరు చెప్పినా..రాష్ట్ర ప్రజలకు సహాయం చేసిన వాడినవుతాను అని ఆయన రియలైజ్ అయితే అది బిజెపిపై తీవ్ర ప్రభావం చూపుతుందన శివాజీ చెప్పాడు.
శివాజీ చెప్పిన దాంట్లో ఎంతో లాజిక్కు కూడా ఉంది. మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడుపై పదవీలోలుడు, పదవి లేనిదే తీవ్రవేదన చెందుతాడనే విమర్శ ఉంది. మరి శివాజీ వెంకయ్యని రాజీనామా చేయమంటే చేస్తాడా? అదే పదవిలో తమిళ వారు ఉంటే ఈ పాటికి రాజీనామా చేసేవారనేది వాస్తవం.