తొలిప్రేమకి ముందు రాశిఖన్నా ఎన్ని సినిమాల్లో నటించినా బొద్దు పాపగానే చూశారు గాని, ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు లేవనే అనుకున్నారు అంతా. ఎందుకంటే గ్లామర్ గా వున్నా బరువు పెరుగుతూ ఉన్న రాశిఖన్నాకి స్టార్ హీరోల సినిమాల్లో అసలు అవకాశాలే రాలేదు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'జై లవ కుశ' లో అవకాశం వచ్చినా అది రాశి కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. కానీ 'తొలిప్రేమ' సినిమా వచ్చేసరికి రాశిఖన్నా చాలా బరువు తగ్గి గ్లామరస్ గా అందమైన అమ్మాయిలా తయారైంది. 'తొలిప్రేమ' హిట్ తో రాశిఖన్నాకి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ చాలా దగ్గరలోకి వచ్చేసింది.
మరొక్క హిట్ పడిందా అమ్మడు టాప్ చైర్ ఎక్కడం ఖాయం.... ప్రస్తుతం వచ్చే హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమే. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉన్న రాశిఖన్నా తన బరువు కారణంగా చాలా అవకాశాలే పోగొట్టుకుంది. అందుకే అమ్మడు చాలా కష్టపడి వర్కౌట్స్ చేసి మరీ వెయిట్ తగ్గించుకుంది. అందుకే 'తొలిప్రేమ' టైమ్ కి చాలా సన్నబడి అందమైన హీరోయిన్ లా తయారై దెబ్బకి హిట్ కొట్టింది. ఆ సినిమా హిట్ తో అమ్మడుకి అవకాశాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో పక్కన 'శ్రీనివాస కల్యాణం'లో నటిస్తున్న రాశి మరిన్ని అవకాశాలు పట్టేలా కనబడుతుంది.
మరి ఉన్న ఈ స్లిమ్నెస్ తో మరిన్ని అవకాశాల కోసం ఇక బరువు పెరగకూడదని డిసైడ్ అవ్వడమే కాదు... ప్రస్తుతం చేతినిండా బోలెడు అవకాశాలు ఉన్నా కూడా అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హంగామా షురూ చేసింది. స్టైలిష్ అండ్ స్లిమ్ లుక్ తో అందమైన ఫోటోలు తీయించుకుని మరీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. మరి తాజాగా రాశిఖన్నా పోస్ట్ చేసిన ఒక ఫోటో అందరికి తెగ నచ్చేస్తుంది కూడా.. గోల్డ్ కోటెడ్ పొట్టి స్కర్ట్ లో రాశి న్యూ లుక్స్ మాత్రం మత్తెక్కిస్తున్నాయి. మరి రాశిఖన్నా స్లిమ్ లుక్ కి ప్లాట్ అయ్యి స్టార్ హీరోలెవరైనా అమ్మడుకి అవకాశాలిస్తారేమో చూద్దాం. మరి ఇప్పటికే రాశిఖన్నా రాజమౌళి కంట్లో పడి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కోసం ఆలోచింపజేసిందనే న్యూస్ ఉంది.