సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'సాహో' సినిమా కోసం ప్రభాస్ తన పూర్తి లుక్ ని చేంజ్ చెయ్యడమే కాదు.. చాలా స్లిమ్ కూడా అయ్యాడు. 'బాహుబలి' కోసం బరువు పెరిగిన ప్రభాస్ 'సాహో' కోసం బాగా బరువు తగ్గాడు. మరి సాహో లో తాను చెయ్యబోయే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్రభాస్ ఇలా తన ఫిట్నెస్ చూపిస్తున్నాడు. మరి గత ఏడాది వరకు బాగా లావుగా కనబడిన ప్రభాస్ ఒకే ఒక్క ఏడాదిలో పూర్తి డైట్ పాటించడమే కాదు... వర్కౌట్స్ గట్రా చేసి తన బాడీ షేప్ ని పూర్తిగా మర్చేశాడు. ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న ప్రభాస్ ఫోటో చూస్తుంటే బాహుబలికి, సాహో కి ప్రభాస్ తన బాడీలో ఎంత చేంజెస్ చూపించాడు అనిపిస్తుంది.
మరి అలా సన్నబడిన ప్రభాస్ సాహోలో ఎలాంటి యాక్షన్ చేస్తాడో గాని... ఆ సినిమాపై బీభత్సమైన అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ నటిస్తుంది. మరి తాజాగా శ్రద్ద సాహో లుక్ లీకై ఇంటర్నెట్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి చాలా సింపుల్ లుక్ లో శ్రద్ద కనబడింది. ఇక ప్రభాస్ సాహో లుక్ ఎలా ఉంటుందో అనే ఆశక్తి ఇప్పుడు అందరిలో మొదలైపోయింది.