Advertisementt

షాలిని పాండే ప్లేస్ లో సుబ్బులక్ష్మి..?

Tue 13th Mar 2018 10:55 PM
gautami,subbulakshmi,dhruv,varma,arjun reddy,shalini pandey  షాలిని పాండే ప్లేస్ లో సుబ్బులక్ష్మి..?
Gautami’s daughter Subbulakshmi to make debut opposite Dhruv in ‘Varma’ ? షాలిని పాండే ప్లేస్ లో సుబ్బులక్ష్మి..?
Advertisement
Ads by CJ

సినిమాల ఫ్యామిలీస్ నుండి హీరోలు వస్తున్నారంటే ఆ హీరో ఎలా వుండబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంటుంది. కానీ అదే సినిమా ఫ్యామిలీ నుండి హీరోయిన్స్ తెరకి పరిచయం అవుతుంటే మాత్రం అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలని సినిమా తెరకి పరిచయం చెయ్యాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. అందులోను హీరోయిన్స్ గా నటించిన వారు తమ అమ్మాయిలు సినిమాలో హీరోయిన్ అనగానే ఒకింత టెంక్షన్ పడతారు కూడా. కానీ ఈమధ్య కాలంలో అబ్బాయిలకు ధీటుగా స్టార్స్ అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి దూకుతున్నారు. తమిళనాట కమల్ తన ఇద్దరు కూతుళ్ళని హీరోయిన్స్ ని చేశాడు. అదే బాలీవుడ్ లో అయితే ప్రస్తుతం బోని -శ్రీదేవి, షారుఖ్, సైఫ్, సునీల్ శెట్టి, సంజయ్ దత్ ఇలా తమ కూతుర్లను వెండితెరకు పరిచయం చెయ్యడానికి రెడీ అవుతున్నారు కూడా. 

అయితే ఇప్పుడు తాజాగా నటి గౌతమి కూడా తన కూతురిని హీరోయిన్ ని చేయబోతుంది. కమల్ తో సహజీవనం, విడిపోవడం ఆ తర్వాత తన కూతురు మీద దృష్టి పెట్టిన గౌతమి ఇప్పుడు తన కూతురుని సినిమా తెరకి పరిచయం చేయబోతుంది. గౌతమి కూతురు సుబ్బులక్ష్మిని హీరోయిన్ ని చేసే ప్రయత్నాలు ముమ్మరం కూడా చేసింది. అయితే సుబ్బులక్ష్మి మాత్రం ఓ అన్నంత అందంగా ఉండదు. అంతగా హీరోయిన్ అయ్యే లక్షణాలు కనబడవు. ఎందుకంటే ఆమె చాలా నార్మల్ గా ఉంటుంది. అందుకే గౌతమి ఎంతగా ప్రయత్నించినా ఆమెకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

అయితే తాజాగా సుబ్బులక్ష్మి, విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో వెండితెరకి పరిచయం కాబోతుందనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాని తమిళంలో బాల ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండ - షాలిని పాండేలు నటించగా... తమిళ రీమేక్ లో ధృవ్ హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్ గా ఇప్పుడు సుబ్బులక్ష్మి పేరు వినబడుతుంది. ఇప్పటికే ధృవ్ 'అర్జున్ రెడ్డి' లుక్ ఆకట్టుకుంటుంది. మరి ప్రస్తుతం హీరోయిన్ గా ఎవరి పేరుని ప్రకటించకుండా తాత్సారం చేస్తున్న చిత్ర బృందం త్వరలోనే సుబ్బులక్ష్మి పేరును ప్రకటిస్తుందని అంటున్నారు.

Gautami’s daughter Subbulakshmi to make debut opposite Dhruv in ‘Varma’ ?:

TEAM VARMA TO CAST GAUTAMI’S DAUGHTER SUBBULAKSHMI AS THE HEROINE?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ