సినీ ఇండస్ట్రీలో హీరోస్ హీరోయిన్స్ ని అంతగా పొగడరు. కానీ హీరోయిన్స్.. హీరోస్ ని మాత్రం ఓ రేంజ్ లో పొగిడేస్తుంటారు. నెక్స్ట్ సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తారు అని అలా పొగుడుతారా లేదా మనస్ఫూర్తిగా పొగుడుతారా అనేది తెలీదు. కానీ లేటెస్ట్ గా హీరోయిన్ పూజా హెగ్డే.. ఎన్టీఆర్ ను గురించి తలచుకుంటేనే భయం వేస్తోందని కామెంట్ చేసిన విధానం చూస్తే అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
అయితే ఇక్కడ మనం పొరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పూజా హెగ్డే ఎన్టీఆర్ గురించి పాజిటివ్ యాంగిల్ లోనే ఈ విషయాన్ని చెప్పింది. సినిమాల్లో ఎన్టీఆర్ ఎటువంటి కష్టమైన స్టెప్పులును అయినా ఛాలెంజింగ్ గా తీసుకుంటాడని చెప్పింది పూజా హెగ్డే. ఎన్టీఆర్ తో యాక్టింగ్ చేయాలన్న భయం వేస్తోందట పూజాకు.
ఇక పవన్ కళ్యాణ్... త్రివిక్రమ్ అంటే తన తండ్రికి చాలా ఇష్టం అని అంటుంది. అత్తారింటికి దారేది చిత్రాన్ని బోలెడన్ని సార్లు చూశానని అంటోంది. ఇప్పుడు త్రివిక్రమ్ మూవీలో చేసే ఛాన్స్ తనకు రావడంపై.. నాన్న ఫుల్ హ్యాపీ అంటోంది పూజా హెగ్డే. ఉన్నట్టుండి ఒకేసారి పూజా ఇలా అందరిని పొగిడేస్తుంది.. అని ఫిలింనగర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.