ఏదైనా సినిమా హిట్ కావాలంటే అందులోని కథ, పాత్రలను ప్రేక్షకులకు తమకు తాము ఐడెంటిఫై చేసుకుంటే విజయం తథ్యం. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు, హీరోల విజయానికి ఇదే కీలకమైన పాయింట్. 'బొమ్మరిల్లు నుంచి అర్జున్‌రెడ్డి' వరకు ఆ కోవకి చెందిన చిత్రాలే. ఇక నాని వరుస విజయాలు సాధిస్తున్నాడన్నా? శర్వానంద్ దూసుకెళ్తున్నాడన్నా అదే కారణం. ప్రతి ప్రేక్షకుడు ఆయా చిత్రాలలోని పాత్రలు, సంఘటనలతో తమని తాము ఐడెంటిఫై చేసుకుని, తమ పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా ఫీల్‌కావడం ముఖ్యం. ఇక యంగ్‌హీరోల విషయానికి వస్తే ఇప్పటికే హీరో శ్రీవిష్ణు తన చిత్రాలతో తన సత్తా చాటుతున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు. ఉన్నది ఒక్కటే జిందగీ, మెంటల్‌మదిలో' చిత్రాలతో ఆయన తనని తాను ప్రూవ్‌చేసుకున్నాడు.
ఇక ఈయన తాజాగా 'అప్పట్లో ఒకడుండేవాడు' నిర్మాతలతోనే నారారోహిత్ భాగస్వామ్యంలో శ్రీవిష్ణు శ్రీమతి నిర్మిస్తున్న చిత్రం 'నీది నాది ఒకే కథ' లో చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. ఇందులో 'బిచ్చగాడు' ఫేమ్ సట్నా టిట్యూస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్నింటిని రంగరించి కట్‌చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవి, వాటిని పాటిస్తూ ఇంకా బాగా పరీక్షల్లో రాసి సూపర్‌సక్సెస్ సాధించాలని భావించే బడిపంతులు కొడుకు హీరో. ఓ హీరోయిన్ సాయంతో మరింతగా బాగా చదవాలని భావించిన ఆయన ఆశలు అడియాసలు అవుతాయి. తను అనుకోకుండానే తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చే పనిచేస్తాడు. ఇక ర్యాంకులు సాధించిన వాడే గొప్ప, ఉద్యోగం సాధించిన వాడే ప్రయోజకుడు అనే భావన ఎంత పెద్ద తప్పో తెలియజేస్తూ ఇందులో ఉన్న సంభాషణలు ఎంతో ఆలోచించేలా ఉన్నాయి.
శ్రీవిష్ణు సింపుల్‌గా ఉంటే, కొత్త కుర్రాడు వేణు ఉడుగుల డైలాగ్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. సురేష్‌బొబ్బిలి సంగీతం, హీరోయిన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మొదట్లో ఈ చిత్రం నందమూరి కళ్యాణ్‌రామ్ 'ఎమ్మెల్యే'తో పోటీ పడటం అవసరమా? అనిపించినవారికి ఈ ట్రైలర్‌చూస్తే ఈ చిత్రంలో భాగస్వామ్యం అయిన అందరు యువత సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అర్ధమవుతోంది.