సుకుమార్ పక్కా పల్లెటూరి ప్రేమకథ.. అచ్చం పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి రామ్ చరణ్ చెవిటివానిగా నటిస్తున్నాడని.. సమంత మూగ పిల్లలా నటిస్తుందని ప్రచారం ఒక రేంజ్ లో జరిగింది. అయితే రామ్ చరణ్ సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా...చెవిటి వాని పాత్రలో నటిస్తున్నాడని 'రంగస్థలం' రామ్ చరణ్ టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. రామలక్ష్మి పాత్రలో సమంత కూడా మూగ పాత్రే అని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే రంగస్థలం రామలక్ష్మి టీజర్ లో సమంతకి ఒక్క డైలాగ్ లేకపోవడంతో అందరూ సమంత మూగ అమ్మాయిగానే నటిస్తుంది అనుకున్నారు.
అయితే ఎప్పుడూ చిరునవ్వుతో టపటపా మాట్లాడే సమంత రంగస్థలంలో మూగ పాత్రలో నటిస్తుంది అంటే అందరిలో చిన్న అసంతృప్తి మొదలైంది. అసలు సమంతని ఇలా సైలెంట్ గా చూడడం ఎలా అబ్బా అని అక్కినేని అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అయితే రంగస్థలంలో సమంత మూగ పాత్ర కాదని మాటలొస్తాయని చెబుతున్నారు. అది కూడా ఈ రోజు విడుదల చెయ్యబోయే ట్రైలర్ లో చూడొచ్చు అంటున్నారు. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఒక డైలాగ్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది.'ఏవయ్యా నేను ఇయ్యి కొనుక్కుత్తానే.. గిల్లుతున్నావేంటి గాజులు కొనిపెట్టమంటే' అంటూ రామలక్ష్మి...చిట్టిబాబుని నిలదీసే డైలాగ్ సినిమాకే హైలెట్ అనేలా ఉందంటున్నారు.
మరి ఈ రోజు విడుదలయ్యే రంగస్థలం ట్రైలర్ లో కావాల్సిన కంటెంట్ ఉంటుందని.... అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తమ చెర్రీతోపాటు బాస్ చిరుని కూడా చూస్తూ వారి స్పీచ్ వినేందుకు మెగా అభిమానులు వైజాగ్ లో కాచుకుని కూర్చున్నారు.