వెండితెరపైనే గ్లామర్ షో, బుల్లి తెరపై కాదు.. అనే అభిప్రాయాన్ని మార్చివేసిన యాంకర్ కమ్ నటి అనసూయ. అంతేకాదు... ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా తన అందచందాలు, టాలెంట్‌తో ఈమె వెండితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇక ఈమె ప్రస్తుతం రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొంది, ఈనెల 30వ తేదీన విడుదల కానున్న 'రంగస్థలం 1985' చిత్రంలో కీలకపాత్రను చేస్తోంది. ఇందులో రామ్‌చరణ్ చిట్టిబాబు, సమంత రామలక్ష్మీల తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న పాత్ర అనసూయ చేస్తోన్న 'రంగమత్త' అనే క్యారెక్టర్ అని సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్ర చరణ్‌కి అన్నయ్యగా నటించే ఆదిపినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ వంటి వారికి పోటీగా ఉండనుందని అంటున్నారు. ఇక ఈమె మీద 'మంగమ్మత్త, రంగమ్మత్త' అనే పాటే ఉందంటే అది ఎంతో కీలకమైనదని భావించాలి. ఇక గ్రామాలలో ప్రతి ఒకరు వేరే వారిని ఏదో ఒక వరుసతోనే పిలుస్తుంటారు. సుబ్బన్న, అనసూయమ్మ అత్త, రామలక్ష్మి పిన్ని... ఇలా ప్రతి పాత్రకు ఓ బంధుత్వం కలిపే విధానం ఇప్పటికీ గ్రామాలలో ఉంది. ఇక 1985 ప్రాంతంలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉండేది. అలాగే ఈ చిత్రంలో అనసూయ 'రంగమత్త' కూడా ఓ క్యారెక్టర్ పేరే గానీ ఆమె ఎవ్వరికీ అత్త కాదని, ఊర్లోని అందరు 'రంగమ్మత్త' అని పిలుస్తుంటారని సమాచారం.
ఇక ఈ చిత్రంలో తనని ఆ పాత్ర చేయమని సుకుమార్ అడిగినప్పుడు ఆమె నో చెప్పిందట. నా అభిమాన స్టార్ రామ్‌చరణ్. ఈయన నన్ను అత్తా అని పిలవడం, నేను అల్లుడు అని పిలవడం బాగుండదని భావించి నో చెప్పిందట. కానీ సుకుమార్ పట్టుబట్టి గోల చేయడంతోనే ఈ చిత్రంలో నటించానని, అలాంటిది ఈ చిత్రంలో ఈ రోల్ చేశానంటే అది సుకుమార్ మీద నాకున్న ధైర్యమే కారణమని చెప్పింది. ఇక మొదట్లో ఈ పాత్ర విషయంలో కాస్త సందేహాలు వచ్చినా డబ్బింగ్ చెప్పేనాటికి ఈ పాత్రతో ట్రావెల్ చేశాను. చిట్టిబాబు, రామలక్ష్మి, కుమార్‌బాబులతో కలసి ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకుని వెళ్తామని, పూర్తిగా గ్రామీణ వాతావరణంలో లీనమయ్యేలా చేస్తామని అనసూయ తెలిపింది. ఇక ఈచిత్రం ప్రీరిలీజ్ వేడుకలో హోస్ట్ చేస్తున్న తన తోటి యాంకర్ సుమ అమెని వేదికపైకి పిలవగానే. ఇంత త్వరగా నన్నెందుకు పిలిచావు? నేను దేవిశ్రీప్రసాద్ స్టేజీ మీద ఉన్నప్పుడు రావాలని భావించాను అంది. వెంటనే సుమ స్పాంటేనియస్‌గా స్పందించి ఈ చిత్రంలో నన్ను కూడా రామ్‌చరణ్‌కి అక్క పాత్రకి తీసుకోవాలని భావించారని, కానీ నాలాంటి నటిని అక్కగా కాకుండా చెల్లి పాత్రలో అయితే బాగుంటుందని భావించి పెట్టుకోలేదని చమత్కరించడంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి.