Advertisementt

గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్ లుక్ ఇదే..!

Wed 21st Mar 2018 08:09 PM
gopichand,pantham,first look,  గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్ లుక్ ఇదే..!
Gopichand Pantham First Look గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్ లుక్ ఇదే..!
Advertisement
Ads by CJ

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌ డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. 'ఫ‌ర్ ఎ కాస్‌' ఉప శీర్షిక‌. 'బ‌లుపు', 'ప‌వ‌ర్‌', 'జై ల‌వకుశ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది కావ‌డం విశేషం. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - 'మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌ గారి 25వ సినిమా 'పంతం'ను మా బ్యాన‌ర్‌లో చేయ‌డం హ్యాపీగా ఉంది. అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సినిమాలో 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాం. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను ద‌ర్శ‌కుడు చ‌క్రి చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌ గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని స్టైలిష్ లుక్‌లో గోపీచంద్‌ గారు క‌న‌ప‌డ‌తారు. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. అలాగే మెహ‌రీన్ చాలా మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. గోపీ సుంద‌ర్ సంగీతం, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌పీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. మిగిలిన న‌టీనటులు, సాంకేతిక నిపుణులు స‌హ‌కారంతో సినిమాను అనుకున్న‌ట్లు పూర్తి చేసి ఈ వేస‌విలో విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

Gopichand Pantham First Look:

Pic Talk: Gopichand Angry For A Cause  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ