ఈమధ్యకాలంలో హీరోయిన్లు తరచుగా కాస్టింగ్‌కౌచ్, అవకాశాల కోసం పడక సుఖాల గురించి మాట్లాడుతున్నారు. కంగనారౌనత్ నుంచి మాధవీలత, రాధికాఆప్టే, శ్రీరెడ్డి వరకు ఇలాంటి వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇలా బహిరంగంగా, ధైర్యంగా నిజాన్ని ఒప్పుకోవడం అభినందించాల్సిన విషయమే అయినా కూడా ఏదో ముసుగులో గుద్దులాట టైప్‌లో జస్ట్ క్లూ కూడా ఇవ్వకుండా అందరి మీద అనుమానాలు రేకెత్తించేలా వీరు మాట్లాడటం మంచి పద్దతి కాదు. ధైర్యం ఉంటే వారెవ్వరో పేర్లతో సహా చెప్పాలే గానీ కేవలం వార్తల్లో నిలవడం కోసం అందరిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. ఇక గతంలో పలువురు హీరోలు, నిర్మాత, దర్శకులను హీరోయిన్లు బుట్టలో వేసుకుంటున్నారనే కోపంతో ఆయా హీరోయిన్లను పబ్లిక్‌గా కొట్టిన వారి భార్యలు కూడా ఎందరో సినీ ఫీల్డ్‌లో ఉన్నారు. ఇక తాజాగా తమిళ టాప్ ప్రొడ్యూసర్, స్టార్ సూర్య కజిన్ అయిన జ్ఞానవేల్‌రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం సెక్స్‌వర్కర్ల కంటే దిగజారి పెళ్లయి ఆనందంగా ఉన్న కాపురాలను కూల్చివేస్తున్నారని ట్వీట్ చేసింది.
ఇలాంటి వారిని వెంటనే శిక్షించాలని, భర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత భార్యలపై ఉందని, అలాగే ఇతరుల వలలో పడకుండా ఉండాల్సిన బాధ్యత భర్తలపై ఉందని ఆమె కామెంట్ చేసింది. తాను అందరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, అలాంటి వాళ్ల లిస్ట్ తన వద్ద ఉందని, వాటిని త్వరలో బయటపెడతానని సంచలనం సృష్టించింది. దీనికి కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించగా, మరికొందరు మాత్రం అలా ప్రోత్సహించిన వారిలో మీ భర్త జ్ఞానవేల్ రాజా కూడా ఉన్నాడు. ముందు అతనికి విషయం చెప్పు అని నిలదీశారు. దీంతో ఆమె వెంటనే ఈ ట్వీట్‌ని డిలేట్ చేసింది. ఇక తాజా ట్వీట్‌లో నా భర్తతో నాకెంలాంటి ఇబ్బంది లేదు. పెళ్లి చేసుకున్న కొందరు పురుషుల జీవితాలలోకి కొందరు నటీమణులు ప్రవేశిస్తున్నారు. వారిని ఉద్దేశించి మాత్రమే అలా ట్వీట్ చేశానని కవరింగ్ ఇచ్చింది. ఆమె చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఇది ఎన్నో సందర్భాలలో నిరూపితం కూడా అయింది. కానీ ఆమె అందరి మీద అనుమానం వచ్చేలా కాకుండా ధైర్యం ఉంటే అలాంటి వారి పేర్లను బహిరంగంగా చెప్పి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.