వ్యక్తిగతంగా పొగరు అని, సమయపాలన లేదని, ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా తమలో సత్తా ఉంటే ఆ విమర్శలు వారినేమీ చేయలేవు. ఉదాహరణకు దీనికి ప్రకాష్‌రాజ్‌నే చెప్పుకోవచ్చు. ఆయన సమయానికి రాడని, ఆలస్యం చేస్తుంటాడని, పలు సార్లు ఆయనపై బ్యాన్ విధించిన కూడా మరలా ఆయన్నే పిలిచి పెద్ద పీట వేశారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తున్న నటి మల్లార్‌బ్యూటీ సాయిపల్లవి. 'ప్రేమమ్' చిత్రంతోనే దేశం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకున్న ఈ కోయంబత్తూర్ బ్యూటీ 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తర్వాత నానితో 'ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం చేసింది. యావరేజ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ద్వారా కూడా ఆమె తన అభిమానులనైతే మెప్పించగలిగింది. ఇక ఈమె ప్రస్తుతం సూర్యతో ఓ చిత్రంతో పాటు రెండు మూడు తమిళ, ద్విభాషాచిత్రాల విషయంలో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈమె నాగశౌర్యతో నటిస్తున్న 'కణం' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని '2.0' నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండటం విశేషం. ఇక ప్రస్తుతం ఈమె శర్వానంద్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడిపడిలేచె మనసు' చిత్రంలో హీరోయిన్ పాత్రని చేస్తోంది.
తాజాగా ఈమె ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌కి ఓకే చెప్పిందని సమాచారం. ఈ శుక్రవారం విడుదలైన అన్ని చిత్రాలలోకి మరీ ముఖ్యంగా 'ఎమ్మెల్యే' కంటే 'నీది నాది ఒకే కథ' చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్, మంచి టాక్ వచ్చాయి. మరి ఈ చిత్రం మంచి చిత్రంగా అందరి మదిలో గుర్తుండిపోతున్నా కూడా బి,సి సెంటర్లలో కలెక్షన్లు సరిగాలేవు. ఈనాడు వంటి మీడియా సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా బాలీవుడ్ క్లాసిక్ 'తారే జమీన్ పర్'తో పోల్చింది. ఈ చిత్రాన్ని తీసిన వేణు ఉడుగులలో మంచి టాలెంట్ ఉందని ఈ చిత్రం నిరూపించింది. ఆయన ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీని తయారు చేసుకుని సాయిపల్లవికి వినిపించాడట. కథ బాగా నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని, ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో వేణు బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా సాయిపల్లవి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమనే చెప్పవచ్చు.