ట్రంప్ గారాల పట్టి ఇవాంకా హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆగిపోవడం, పోలీసులు చెకప్‌లు ఇవ్వన్నీ చూసి ట్రంప్ కుమార్తె కోసం ఇలా చేస్తున్నారు. మరి మన నాయకులు ఇతర విదేశాలకు వెళ్లితే ఇలానే చేస్తారా? వారు వచ్చినప్పుడు కల్పించే సదుపాయాలు మామూలు సందర్భాలలో కూడా జనాలకు అందించరా? అని నటి మాధవీలత మండిపడింది. ఇక ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి కూడా పబ్లిగ్గా మాట్లాడి సంచలనం సృష్టించింది. ఓ విధంగా శ్రీరెడ్డికి ఈమె మద్దతు తెలిపింది. ఇక ఇప్పుడు మరో రాజకీయ అంశంతో ముడిపడిన విషయంతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఈమె తాజాగా మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రజలకు సేవ చేయాలనే యోచన తన తాతగారి నుంచి వచ్చేఉంటుంది. జూనియర్ తెలుగుదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి, మాటకారి కూడా. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తాడని భావించాను. కానీ ఆయన చేయకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆయనను ఎందుకు పక్కన పెట్టారో నాకు అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ తెలుగుదేశంలోనే ఉండాలి.
ఇక ఈ వ్యాఖ్యలను రాజకీయం చేయవద్దు. ఈ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం. వాటిని రాజకీయం చేయకండి... నా మాటలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను కేవలం నా మనసులోని భావాలనే బయటపెట్టానని చెప్పి తేనెతుట్టెను కదిపింది. అసలు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో సరిగా ఉండటం లేదు. చివరకు ఎన్టీఆర్ బయోపిక్‌కి కూడా నందమూరి కళ్యాణ్‌రామ్ తప్పితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు రాలేదు. ఇది పొలిటికల్‌గా కూడా ఎన్నో వాద వివాదాలకు కారణమైంది. అలాంటి రాజకీయ విషయాన్ని కదుపుతూనే... దీనిని రాజకీయం చేయవద్దని మాధవీలత కోరుతూ, ఇన్‌డైరెక్ట్‌గా దానిపై చర్చ సాగేలా... తాను వార్తల్లో ఉండేలా చేసుకుంటోందని అనిపిస్తోంది. ఇక చంద్రబాబుకి కిందటి ఎన్నికల్లో పవన్ పక్కన ఉండటం కలిసి వచ్చింది. మరి ఈసారి ఎన్నికల నాటికైనా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ని చేరదీస్తాడని, పవన్ మద్దతు తెలుపని తరుణంలో సినీ ఇమేజ్ కోసం ఇది తప్పక పోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.