Advertisementt

శ్రీరెడ్డి - మాధవీలతలకు రకుల్ క్లాస్!

Mon 02nd Apr 2018 09:00 PM
rakul preet singh,sri reddy,madhavi latha,counter  శ్రీరెడ్డి - మాధవీలతలకు రకుల్ క్లాస్!
Rakul Preet Singh Counter To Sri Reddy and Madhavi Latha శ్రీరెడ్డి - మాధవీలతలకు రకుల్ క్లాస్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. ఈ పదం ఏ సినీ ఇండస్ట్రీలో ఐన బాగానే వినిపిస్తోంది. కానీ టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువయిందనే చెప్పాలి. ముఖ్యంగా దీనిపై హీరోయిన్స్ స్పందించటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా శ్రీ రెడ్డి - మాధవీలత స్పందించిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దీనిపై స్పందించింది. టాలీవుడ్ లో నేను ఎప్పటినుండో వుంటున్న కానీ అలాంటివి ఏమి ఎదురు అవ్వలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఊపందుకుంది. రకుల్ స్పందించిన తీరును శ్రీరెడ్డి - మాధవీలత తప్పు బట్టారు. జనాలను పిచోళ్ళని చేస్తున్నావా? అని కౌంటర్లు కూడా ఇచ్చారు.

నువ్వు బాగానే సెటిల్ అయ్యావ్ బిజినెస్ కూడా చేసుకుంటున్నావ్ అని ఇతర విషయాలను కూడా ప్రస్తావిస్తూ రకుల్ పై మాటలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ విషయం రకుల్ కి లేట్ గా తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. తనదైన శైలిలో కౌంటర్ కూడా వేసింది. మా అమ్మ నానకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలాంటి ఇండస్ట్రీలో నువ్వు వర్క్ చేస్తున్నావా అని అనేవారు. తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడకండి అని రకుల్ తెలిపింది.

Rakul Preet Singh Counter To Sri Reddy and Madhavi Latha:

Rakul Preet Singh's Strong Counter to Sri Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ