Advertisementt

యాంకర్లపై మరో యాంకర్ సెటైర్..!

Tue 03rd Apr 2018 02:51 PM
anchor shyamala,patas show,vulgarity,telugu anchors  యాంకర్లపై మరో యాంకర్ సెటైర్..!
Anchor Shyamala about Patas Show Vulgarity యాంకర్లపై మరో యాంకర్ సెటైర్..!
Advertisement
Ads by CJ

తెలుగు యాంకరింగ్‌కి గ్లామర్‌డోస్‌ ఇచ్చిన వారిలో అనసూయ, రేష్మి, శ్రీముఖి వంటి వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కానీ సుమ లాగే యాంకర్‌ శ్యామల కూడా ఎంతో సంప్రదాయ బద్దంగా కార్యక్రమాలను హోస్ట్‌ చేస్తుంది. ఇటీవల తన తలని ఎవరో మార్ఫింగ్‌ చేసి బ్లూ ఫిల్మ్‌లో పెట్టారని, వాటిని తన భర్త చూసే దాకా తనకి తెలియదని, తన భర్త కూడా సినిమా వ్యక్తి కావడం వల్ల అర్ధం చేసుకున్నాడని, లేకపోతే తన జీవితం ఏమైపోయేది? అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఆమె అనసూయ, రేష్మి, శ్రీముఖి వంటి వారిని ఇన్‌ డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

నేను 'పటాస్‌' వంటి షోలను హ్యాండిల్‌ చేయలేను. అలాంటి షోలు గోదావరి జిల్లాలకు చెందిన నాకు పడవు. అదే సమయంలో వాటిని చూసి మాత్రం ఎంజాయ్‌ చేస్తాను. ఇతరులను గౌరవించకుండా పిలవడం నాకు చేతకాదు. గోదావరి యాసలో లాగా 'అండీ', 'గారు' వంటి పదాలు పలకకుండా ఎవ్వరినీ పిలవలేను. అందువల్ల నేను అలాంటి షోలు చేయలేను. ఏరా, ఒరేయ్‌, నీ ఎంకమ్మ వంటి మాటలను నేను పలకలేను. ఇక ఇటీవల నేను ధరించే దుస్తులపై కూడా కామెంట్స్‌ వస్తున్నాయి. నేను వేసుకునే దుస్తుల విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను. మరెవ్వరి ప్రమేయం ఇందులో ఉండదు. ఉండటానికి ఒప్పుకోను అని చెప్పుకొచ్చింది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం చాలెంజింగ్‌ అనిపిస్తుందని తెలిపిన ఆమె ఇన్‌డైరెక్ట్‌గా అనసూయ, రేష్మి, శ్రీముఖిలపై సెటైర్లు వేసినట్లే కనిపిస్తోందని చెప్పవచ్చు.

Anchor Shyamala about Patas Show Vulgarity:

Anchor Shyamala About Telugu Anchors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ