మెగా హీరోయిన్ నాగబాబు కూతురు నీహారిక సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్ల పైన అవుతుంది. 'ఒక మనసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నీహారిక ఆ తర్వాత తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. తమిళ్ లో విజయ్ సేతుపతి సినిమా చేసింది కానీ ఆ సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వలేదు.
అయితే ఇప్పుడు ఈ మెగా డాటర్ కి అదిరిపోయే అవకాశం వచ్చింది. చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఈమె ఓ కీలకమైన పాత్ర చేయబోతుందంట. ఆ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసినంత పని చేసిందట నీహారిక. టాలీవుడ్ లో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అంతటి పెద్ద ప్రాజెక్ట్ నటించే ఆఫర్ రావడంతో నీహారిక ఆనందానికి హద్దులు లేవంట.
సినిమాలో నీహారిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఈ క్యారెక్టర్ కు నీహారిక కరెక్ట్ గా సెట్ అవుతుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావించి ఆమెను సెలెక్ట్ చేశాడంట. దీనికి చిరు అండ్ చరణ్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో సైరాలో నీహారిక ఎంట్రీ ఖాయం అయిపోయింది.