మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం 'ధృవ' తప్పితే, అది కూడా యూఎస్‌కి వెళ్లి కాళ్లరిగేలా ప్రమోట్ చేస్తే గానీ ఈ చిత్రం 1.5మిలియన్ డాలర్ల క్లబ్‌లో మాత్రమే చోటు సాధించుకుంది. మరోవైపు చెప్పను బ్రదర్ అనే వ్యాఖ్యల నుంచి అల్లుఅర్జున్, అల్లు ఫ్యామిలీ అంటే మెగాభిమానులు మండి పడుతున్నారు. మెగాభిమానులు ప్రస్తుతం చరణ్-పవన్-చిరంజీవి, అల్లుఅర్జున్-అల్లుశిరీష్‌లుగా విడిపోయారని స్పష్టమవుతోంది. 'మగధీర' తర్వాత ఆ స్థాయి హిట్ రామ్‌చరణ్‌కి రాకపోవడం... ఓ దశలో వరుసగా త్రివిక్రమ్‌తో రెండు చిత్రాలతో పాటు మిగిలిన చిత్రాలు కూడా యావరేజ్ కంటెంట్‌తో కలెక్షన్లు ఇరగదీయడంతో బన్నీ రామ్‌చరణ్‌ని మించిపోయాడని కొందరు బన్నీ అభిమానులు రామ్‌చరణ్‌పై కామెంట్స్ విసరడం జరిగింది. ఎట్టకేలకు రామ్‌చరణ్ 'రంగస్థలం'తో పాటు ఇక కూడా కేవలం తాను అభిమానుల కోసం సినిమాలు చేయనని, తనకి నచ్చిన చిత్రాలు చేస్తానని, తనకి నచ్చితే ఫ్యాన్స్‌కి కూడా నచ్చే తీరుతాయని ఓపెన్‌గా చెప్పి సెహభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ చిత్రం గురించి ఎన్టీఆర్ నుంచి నమ్రతా శిరోద్కర్ వరకు అందరు 'రంగస్థలం' చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నా ఏదో మాట వరసకి అల్లుశిరీష్ బాగుంది అని ట్వీట్ చేయడం తప్ప బన్నీ నుంచి గానీ అల్లుఅరవింద్ నుంచి గానీ ఎలాంటి పొగడ్తలు లేవు. అదేమంటే బన్నీ 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'లో బిజీగా ఉన్నాడని అంటున్నారు.
ఇక తాజాగా బన్నీ కుమారుడు అయాన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఫొటోలను అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'నా బెస్టీకి బర్త్‌డే శుభాకాంక్షలు. మై బేబీ అయాన్ నా సంతోషం అని ట్వీట్ చేస్తూ ఆ ఫొటోని పోస్ట్ చేశాడు'.ఆయన శ్రీమతి అయాన్ తల్లి స్నేహారెడ్డి కూడా అయాన్‌కి పుట్టినోరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇలా తన కుమారుడి బర్త్‌డేకి విషెష్ చెప్పిన బన్నీ 'రంగస్థలం'పై మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉండటంతో ఈ అనుమానాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఇక అయాన్ బర్త్‌డే కానుకగా ఈ చిత్రం యూనిట్ ఓకొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఎడమ కంటిపై గాటుతో ఫేస్‌మీద మన దేశంలోని నగరాల పేర్లను కనిపించి కనిపించకుండా మొహానికి చేతులు అడ్డుపెట్టుకున్న పవర్‌ఫుల్ బన్నీ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ షార్ట్ టెంపర్ ఉన్న మిలటరి ఉద్యోగిగా, దేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాద దాడి చేయాలనే విలన్ల ప్లాన్‌ని చెడగొట్టే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక బన్నీ పుట్టిన రోజు 8న డైలాగ్ ఇంపాక్టుని వదలనున్నారు.