Advertisementt

గ్లామర్‌ పాత్రలకే పరిమితం అంటోంది.....!

Sun 08th Apr 2018 03:22 PM
kajal,lady oriented,glamour roles  గ్లామర్‌ పాత్రలకే పరిమితం అంటోంది.....!
Kajal Wants Glamour Roles Only గ్లామర్‌ పాత్రలకే పరిమితం అంటోంది.....!
Advertisement
Ads by CJ

మన సౌత్‌లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ పాత్రలు చేస్తే ఇక హీరో పక్కన గ్లామర్‌షో చూపిస్తూ, గంతేసే పాత్రలు రావు. కేవలం జనాలు, మేకర్స్‌ వారిని లేడీ ఓరియంటెడ్‌ పాత్రలకే పరిమితం చేసి, ఫేడవుట్‌కి దగ్గరగా ఉందని తేలుస్తారు. ఈ విషయంలో నయనతార, అనుష్క, సమంత వంటి కొందరే మినహాయింపు. అయితే బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు. కంగనారౌనత్‌, ప్రియాంకాచోప్రా, విద్యాబాలన్‌, దీపికాపడుకోనే వంటి వారు అటు లేడీ ఓరియంటెడ్‌ పాత్రలతో పాటు హీరోల సరసన గ్లామర్‌షో చేసినా జనాలు చూస్తారు. ఇక విషయానికి వస్తే కాజల్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం అవుతోంది. చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌, రానా, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లని కూడా ఆమె కవర్‌ చేసింది. 50 చిత్రాలు దాటినా ఇంకా తన హవా సాగుతోందనే ఉద్దేశ్యంలో అయితే ఉంది. ఇప్పటికీ తనకు సీనియర్స్‌, యంగ్‌స్టర్స్‌ అందరితో కలిసి నటించే అవకాశాలు వస్తుండటంతో పొరపాటున లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు చేస్తే ఫేడవుట్‌ అవుతోందని, చాన్స్‌లు లేవని అనుకుంటారని ఈ చందమామ భావిస్తోంది. 

ప్రస్తుతం తమిళ సీనియర్‌ దర్శకుడు పి.వాసు ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించే యోచనలో ఉన్నాడు పి.వాసు. దాంతో ఈ పాత్రకి కాజల్‌ అయితే బాగా సూట్‌ అవుతుందని, ఆమెని సంప్రదించి కథను వివరించాడట. సినిమా సబ్జెక్ట్‌, తన పాత్ర అన్నీ నచ్చినా కాజల్‌ మాత్రం నో చెప్పిందని సమాచారం. ప్రస్తుతం కాజల్‌ తన రెమ్యూనరేషన్‌గా కోటి రూపాయల వరకు తీసుకుంటోంది. ఈ చిత్రంలో నటిస్తే రెండు కోట్లు పారితోషికంగా ఇస్తామని పి.వాసు ఆఫర్‌ చేసినా ఇప్పుడే సినిమాల కథనంతా నా భుజాన వేసుకుని నడిపే పాత్రలు చేయదలుచుకోలేదు. మరికొంత కాలం హీరో ఓరియంటెడ్‌ చిత్రాలలోనే గ్లామర్‌ పాత్రలు చేయాలని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తే నాకు అలాంటి అవకాశాలు తగ్గిపోతాయని ఆమె ఎంతో తెలివిగా ఆలోచించి నో చెప్పిందని సమాచారం. ఎంతైనా కాజల్‌ తెలివి తేటలు సూపర్‌ అని మెచ్చుకోవాల్సిందే...! 

Kajal Wants Glamour Roles Only:

Kajal Says No to Lady Oriented Films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ