Advertisementt

ప్రభాస్-నిహారిక పెళ్లి వార్తల్ని చిరు ఖండించాడు!

Wed 11th Apr 2018 02:32 PM
prabhas,niharika,marriage,rumours,chiranjeevi  ప్రభాస్-నిహారిక పెళ్లి వార్తల్ని చిరు ఖండించాడు!
Chiranjeevi About Prabhas and Niharika Marriage Rumours ప్రభాస్-నిహారిక పెళ్లి వార్తల్ని చిరు ఖండించాడు!
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్ల నుండి నిన్నటివరకు ప్రభాస్ పెళ్లి అనుష్కతో ముడి పెట్టి రాశారు. కానీ నిన్నటి నుండి ప్రభాస్ పెళ్లి మెగా హీరోయిన్ తో అంటూ గాసిప్స్ ప్రసారం అవుతున్నాయి. అసలు టాలీవుడ్ లోనే అతిపెద్ద జోక్ గా ప్రభాస్ - మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి అనే వార్తలను అభివర్ణిస్తున్నారు. అసలు ఈ రకమైన గాసిప్స్ ఎందుకు పుడతాయో తెలియదు కానీ... ఇలాంటి రూమర్స్ వల్ల చాలామంది బాధపడతారు. బాహుబలిగా ప్రపంచ వ్యాప్తి గుర్తింపు పొందిన ప్రభాస్.. తన పెళ్లి విషయంలోనూ అంతే హైలెట్ అవుతున్నాడు. మరి ముప్పై ఆరేళ్ళు వచ్చేసిన పెళ్లి చేసుకోకపోతే ఇలాంటి రూమర్సే వినాల్సి వస్తుంది.

నిన్నటి వరకు స్వీటీని పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ అంటూ బోలెడన్ని వార్తలు మీడియాలో వినిపించాయి. వాటిని ప్రభాస్, అనుష్కలు ఖండిస్తూనే వచ్చారు. ఇప్పుడు తాజాగా చిరు పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక - ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఫిలింనగర్ లో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలిసినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మాదిరిగా ట్రేండింగ్ లోకొచ్చేసింది. ప్రభాస్ మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారికల పెళ్లి అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ తో వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ప్రభాస్ - నిహారికల పెళ్లి అనే న్యూస్ మాత్రం పెద్ద గాసిప్ అని.. అదంతా కేవలం అబద్దమని జాతీయ మీడియా సంస్థ జీ న్యూస్ తెలిపింది. అసలు ప్రభాస్ - నిహారికల పెళ్లి వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారని... అదంతా కేవలం ఒట్టి పుకారు అని  జీ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సాహు సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. తర్వాత రాధాకృష్ణతో మరో మూవీకి సైన్ చేశాడు. మరి సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రభాస్ మాత్రం పెళ్లి గురించిన ఆలోచనలు చెయ్యడం లేదు.

Chiranjeevi About Prabhas and Niharika Marriage Rumours:

Chiranjeevi denies rumours of Prabhas marrying his niece Niharika Konidela

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ